యాప్నగరం

Pawan Kalyan: బిస్కెట్ వేస్తే టైంటుటైం ఠంచనుగా మెరిగేస్తుంది.. పవన్‌ యాక్షన్‌పై దారుణమైన రియాక్షన్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని అక్టోబర్ 8న కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జడ్పీ హైస్కూలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 10 Oct 2020, 8:30 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న విద్యా కానుక పథకంపై సంతోషం వ్యక్తం చేసేవాళ్లు కొందరైతే.. ఈ పథకంపై విమర్శల పర్వం కొనసాగుతోంది. పాత పథకాలనే పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారంటూ దుమారానికి తెరతీశాయి ప్రతిపక్షపార్టీలు.
Samayam Telugu పవన్, జగన్
jagananna vidya kanuka


అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని చేపట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఇది అసత్య ప్రచారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పథకమేనని తేల్చి చెప్పారాయన. ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదని కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని.. ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదే అయితే దేశంలో మరెక్కడా ఎందుకు లేదని ప్రశ్నించారు.

ఈ పథకానికి వంద శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి యూనిఫాంల కోసం కేవలం రూ. 100 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.


మొత్తానికి జగనన్న కానుక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో జనసేన అధినేత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘జగనన్న గారి కానుక’ అనేకంటే కూడా ‘మోదీ-జగనన్న గారి కానుక’ అంటే బాగుంటుంది. 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు.. 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు’ అంటూ ట్వీట్ చేశారు.

పవన్ ట్వీట్‌పై వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. గతంలో రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది అని.. నిధులు తెచ్చుకోవడం రాష్ట్రాల హక్కుఅని అది కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంతో మరోసారి ట్విట్టర్ స్టార్ అనిపించుకున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ట్వీట్‌పై ఘాటుగా స్పందించారు పొలిటికల్, మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. పవన్ కళ్యాణ్‌ను కుక్కతో పోల్చుతూ దారుణమైన ట్వీట్ చేశారు. ఎంతైనా చాలా విశ్వాసం కలిగిన కుక్క ఇది. బిస్కట్ వేస్తే టైంటుటైం ఠంచనుగా మోరిగేస్తుంది!’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు కత్తి మహేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.