యాప్నగరం

డీజే భామకు ఇదేం వింత అలవాటు!

బన్నీ బుగ్గపై ముద్దు పెడుతూ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో తెలుయదు కాని ఈ డీజే భామ చేసే పనులే కాదు.. మాటలు కూడా తేడాగానే ఉన్నాయి.

TNN 25 Feb 2017, 4:03 pm
బన్నీ బుగ్గపై ముద్దు పెడుతూ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో తెలుయదు కాని ఈ డీజే భామ చేసే పనులే కాదు.. మాటలు కూడా తేడాగానే ఉన్నాయి. ‘ఎవరైనా తమ జీవితంలో సంతోషంగా గడపడానికి సమయం కేటాయిస్తూ ఉంటారు. కానీ నటి పూజాహెగ్డే మాత్రం బాధ పడడానికి తన సమయాన్ని వెచ్చిస్తుందట.
Samayam Telugu pooja hegde comments about flop movies
డీజే భామకు ఇదేం వింత అలవాటు!


ఇదేం అలవాటో అనుకుంటున్నారా? కోలీవుడ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తరువాత 'ముకుంద' చిత్రంతో తెలుగు తెరపై మెరిసింది. ఆ తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించిన ఈ భామకు బాలీవుడ్‌లో ఏకంగా హృతిక్ రోశన్‌తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కానీ అది కూడా నిరాశ పరిచింది.

కెరీర్ పరంగా అమ్మడు చేతిలో సరైన హిట్టు సినిమా పడలేదు. దీంతో ఆమెపై ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది. అయితే దీని గురించి బాధ పడడానికి అమ్మడు ప్రత్యేకంగా రోజులో 15 నిమిషాల పాటు కేటాయిస్తుందట. తన సినిమాలు ఫ్లాప్ అవ్వడం తన చేతుల్లో లేదని మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని వేదాంతం మాట్లాడే పూజ ఫ్లాప్ సినిమాలను తలచుకుంటూ బాధ పడడానికి మాత్రం టైమ్ పెట్టుకుంటానని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. కానీ రోజులో ఎక్కువ సమయం పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.