యాప్నగరం

సాక్ష్యాలు చూపించండి: ‘కత్తి‌’కి పూనమ్ సోదరుడి సవాల్

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం పూనమ్ కౌర్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ సంధించిన ఆరు ప్రశ్నలకు ఆమె సోదరుడు బదులిచ్చారు.

TNN 8 Jan 2018, 12:38 pm
పూనమ్ కౌర్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ సంధించిన ఆరు ప్రశ్నలకు ఆమె సోదరుడు శ్యామ్ సింగ్ బదులిచ్చారు. అనవసరంగా తనను వివాదాల్లోకి లాగుతున్నారన్నారు. సోషల్ మీడియాలో పూనమ్ చేసిన వ్యాఖ్యల్లో కత్తి మహేష్ పేరు లేదన్నారు. అతడి సమస్యేంటో మాకు తెలియడం లేదు. మాకెవరితోనూ ఎలాంటి సమస్యా లేదన్నారు. ఆధారాలుంటే చూపించాలని శ్యామ్ సింగ్ డిమాండ్ చేశారు. పెద్దవాళ్లను తిడితే పేరొస్తుందని కత్తి మహేష్ భావిస్తున్నాడు. అందుకే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు.
Samayam Telugu poonam kaurs brother responds over mahesh kathi allegations
సాక్ష్యాలు చూపించండి: ‘కత్తి‌’కి పూనమ్ సోదరుడి సవాల్


ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ కౌర్‌ను నియమించడంలో పవన్ కళ్యాణ్ సాయం చేయలేదని శ్యామ్ సింగ్ స్పష్టం చేశారు. పూనమ్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఆమె ప్రతిభను చూసే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. గత మూడేళ్లుగా తను చేనేత కార్మికుల అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఒక సోదరుడిగా నా మద్దతు తనకు చాలన్నారు.

తిరుమలకు పూనమ్ పవన్‌తో కలిసి వెళ్లారనడం కత్తి మహేష్ భ్రమ మాత్రమే. నా సోదరితోపాటు నేను కూడా తిరుమల వెళ్లాను. మహేష్ కత్తి పవన్ సమస్య విషయంలో నా సోదరిని లాగుతున్నారు. మేం పవన్‌తో వ్యక్తిగతంగా ఎందుకెళ్తామని ప్రశ్నించారు.

పవన్ చేతిలో మోసపోవడం, పూనమ్ సూసైడ్ కోసం యత్నించడం లాంటి ఆరోపణలను శ్యామ్ సింగ్ కొట్టి పడేశారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది, కానీ తన దగ్గరున్న ఆధారాలు చూపించమని ఆయన కత్తి మహేష్‌కు సవాల్ చేశారు.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మా అమ్మకు ఎలాంటి ప్రామిస్ చేయలేదు. తను మాకేమీ సాయం చేయలేదని పూనమ్ సోదరుడు తెలిపారు. త్రివిక్రమ్‌‌తోపాటు ఎవరి మీద తమకు ఎలాంటి గొడవలు లేవన్నారు. త్రివిక్రమ్, పవన్ క్షుద్ర పూజలు చేస్తున్నప్పుడు అక్కడ పూనమ్ కౌర్ అక్కడ ఉన్నారనే వాదనను శ్యామ్ సింగ్ తోసిపుచ్చారు. నాకు తెలిసినంత వరకూ అలా జరగలేదు. సాక్ష్యాలుంటే చూపించాలన్నారు. అనవసరంగా నా సోదరిని వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. కత్తి మహేష్ లాంటి వ్యక్తులను ప్రోత్సహించొద్దని న్యూస్ ఛానెళ్లకు పూనమ్ సోదరుడు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.