యాప్నగరం

‘నేను కిడ్నాప్ అయ్యాను’...

ఓ యువతి కిడ్నాప్‌కు గురికావడం తిరిగి ఆ యువతి కిడ్నాపర్ల చెర నుండి ఎలా బయటపడింది.

TNN 29 Sep 2017, 2:37 pm
మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని 'యూ' సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు అక్టోబర్‌6న ‘నేను కిడ్నాప్ అయ్యాను’ మూవీని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్, రఘు బాబు , కృష్ణ భగవాన్, పృథ్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీకర్ బాబు దర్శకత్వం వహించారు.
Samayam Telugu posani and brahmanandam nenu kidnap ayyanu movie release date locked
‘నేను కిడ్నాప్ అయ్యాను’...


ఈ సందర్భంగా నిర్మాత మాధవి అద్దంకి మాట్లాడుతూ "మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమా చూసి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీకరా బాబు సినిమాని చాల బాగా చిత్రీకరించారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్‌ల హాస్యం చాల బాగుంది. అక్టోబర్ 6న మా చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు శ్రీకర్ బాబు మాట్లాడుతూ " అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. క్లీన్ యూ సర్టిఫికెట్ రావటం చాల సంతోషం గాఉంది. నిర్మాత కంప్రమైస్ కాకుండా సినిమా కి ఎంత కావాలో ఎంత ఖర్చుపెట్టారు. ఓ యువతి కిడ్నాప్‌కు గురికావడం తిరిగి ఆ యువతిని కిడ్నాపర్ల చెర నుండి ఎలా బయటపడిందన్న కాన్సెప్ట్‌తో చాలా ఫన్నీగా మా చిత్రాన్ని తెరకెక్కించాం. ఖచ్చితంగా ‘నేను కిడ్నాప్‌ అయ్యాను’ ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.