యాప్నగరం

Prudhvi Raj Resigns: చెప్పుతీసుకుని కొట్టండి.. పోసాని ఐ లవ్ యు: పృథ్వీ ప్రెస్ మీట్

ఎస్వీబీసీ చైర్మన్, కమెడియన్ పృథ్వీ రాసలీలల ఆడియో టేపులో ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూపై నైతిక బాధ్యత వహిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారాయన. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పోసాని తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

Samayam Telugu 12 Jan 2020, 10:00 pm
తనపై వచ్చిన ఆరోపణలు నిజమని రుజువని తేలితే చెప్పుతో కొట్టమన్నారు నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ. ఒక మహిళతో తాను రాసలీలలు నడుపుతున్నానంటూ వైరల్ అవుతున్న ఆడియో టేప్ ఫేక్ అని.. ఇదంతా కుట్రపూరితరంగా జరిగిందన్నారు పృథ్వీ. ఈ ఇష్యూపై అసలు నిజం తేలేవరకూ నైతిక బాధ్యత వహిస్తూ.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పృథ్వీ.
Samayam Telugu Prudhvi Vs Posani Murali Krishna
పోసాని, పృథ్వీ


రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఇష్యూపై వివరణ ఇస్తూ ఆదివారం నాడు హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు పృథ్వీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై పోసాని క్రిష్ణమురళి చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. ‘నేను రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్‌లు అన్నానని మా మిత్రుడు పోసాని గారికి కోపం వచ్చింది.. అయితే నేను అన్నది ఒరిజినల్ రైతుల్ని కాదు. నిజమైన రైతులకు నేను క్షమాపణ చెప్తున్నా. నేను ఎప్పుడూ రైతులపై తప్పుగా మాట్లాడలేదు.

సినిమా రంగంలో పోసాని నేను మంచి మిత్రులం. ఒక రకంగా నాకంటే సీరియర్. డబుల్ ఎంఎ, పీహెడ్డీ చేశారు. మేం ఎదురు పడినప్పుడు చాలా సంస్కారంగా మాట్లాడుకుంటాం. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం పోసానికి అలవాటు. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు.. తమ్ముడూ మనలో తప్పు ఉంటే తల దించుకోవాలి.. తప్పు లేకపోతే తల దించాల్సిన అవసరం లేదు. పోసాని అలాగే ఉంటాడు.. పృథ్వీ కూడా అలాగే ఉండాలని చెప్పేవారు.

మా ఇద్దరి మధ్య అనవసరంగా గొడవలు తెచ్చి వైరాలను సృష్టించి సామాజిక వర్గాలుగా విడగొట్టారు మా ఇద్దర్నీ. కాని నేను ఇప్పటికీ ‘ఐ లవ్ పోసాని బ్రదర్’ నా అన్న నన్ను తిట్టినా ఆశీర్వచనంలాగనే భావిస్తున్నా. మా అన్నని నేను ఎప్పుడూ గౌరవిస్తా. పోసాని అన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీ.

పృథ్వీపై పోసాని చేసిన కామెంట్స్ ఇవే: జగన్‌ని జగన్ గాడు అంటున్నారంటే నీవల్లే పృథ్వీ.. సిగ్గు పడు: పోసాని ఘాటు వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.