యాప్నగరం

‘ఆ రోజు నేనెక్కడున్నానో కూడా పట్టించుకోలేదు’

తాను చెప్పదలచుకున్న విషయాన్ని ముఖంపై కొట్టినట్లు చెప్పే కొంత మంది సినీ నటుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. మనసులో మాటలను భయపడకుండా వెల్లడించడం ఆయన నైజం.

TNN 12 Nov 2017, 11:11 am
తాను చెప్పదలచుకున్న విషయాన్ని ముఖంపై కొట్టినట్లు చెప్పే కొంత మంది సినీ నటుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. మనసులో మాటలను భయపడకుండా వెల్లడించడం ఆయన నైజం. అయితే సినిమా షూటింగ్ కోసం పోసాని కృష్ణమురళి ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటాడంటూ ఫిల్మ్ నగర్లో ఓ టాక్ వుంది. దీని గురించి ఆయన మాట్లాడుతూ, 'అవును నిజమే...పోసాని కృష్ణమురళి సినిమాలు తీసి చేతులు కాల్చుకుని నిండా అప్పుల్లో మునిగిపోయినప్పుడు వీరంతా ఏమయ్యారని ప్రశ్నించారు.
Samayam Telugu posani krishna murali frankly speaking about roumers
‘ఆ రోజు నేనెక్కడున్నానో కూడా పట్టించుకోలేదు’


ఆస్తులు అమ్ముకుని కష్టాలపాలైనప్పుడు వీళ్లంతా ఎందుకు మాట్లడలేదు.... అప్పుడు స్పందించని వీరు... ఇప్పుడు మాత్రం పోసాని కృష్ణమురళి 'ఇంత' డబ్బు తీసుకుంటాడని ప్రచారం చేయడం సరికాదని సూచించారు. ఒకానొక సమయంలో ఆస్తులు అమ్ముకోవడమే కాదు, అప్పులు పాలయ్యానని, ఇప్పుడు అవన్నీ తీర్చేశానని తెలిపాడు. ఏ పని చెయ్యకపోయినా నా కుటుంబం, నేను జీవితాంతం కూర్చుని తినేంత ఆస్తిని తెలుగు చిత్రపరిశ్రమ తనకు అందించిందని.... ఇందుకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పాడు.

అలాగే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో కులం పేరు చెప్పుకుని ఓట్లు అడిగాననే విమర్శలు కూడా కరెక్టు కాదని అన్నారు. ‘అప్పుడు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఇంటికి వెళ్లి.. నాకు ఓటు వేయమని ఇంటావిడను అడిగానని అన్నారు. అయితే ఇంట్లోకి రమ్మని ఆహ్వనించితే వెళ్లి కూర్చున్నా... కొత్తగా పోటీ చేస్తున్నా నాకు ఓటెయ్యమని అడిగితే, ‘లేదయ్యా, నువ్వు కాపుల పార్టీ తరఫున నిలబడ్డావు. మరి, కాపులు గెలిస్తే.. మనల్ని.. కమ్మోళ్లని బతకనివ్వరు. అందుకని, నీకు ఓటెయ్యను. నువ్వు మంచోడివి..వేరే వాళ్లకు ఓటేస్తా’ అని చెప్పింది. ‘మరి, టీ అయినా ఇస్తావా? తాగి వెళతాను?’ అని నేనంటే, ‘ఆ..ఇస్తాను’ అంటూ టీ ఇచ్చింది’ అప్పుడు జరిగింది ఈ సంఘటనే తప్పా ఇంతకు మించేమీ జరగలేదు’ అని నాటి విషయాన్ని పోసాని గుర్తుచేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.