యాప్నగరం

సీఎం జగన్ గురించి ఒకే ఒక్క మాట.. ఆయనంతే: పోసాని కృష్ణమురళి కామెంట్స్ వైరల్

Cm Jagan: మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పోసాని కృష్ణమురళి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కొన్ని కామెంట్స్ చేశారు. ఒకే ఒక్క మాట అంటూ జగన్‌ని ఆకాశానికెత్తారు.

Samayam Telugu 22 Mar 2022, 1:29 pm
ఈ రోజు (మంగళవారం) తిరుమల సన్నిధిలో సందడి చేశారు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. ఉదయం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఏపీలో సినిమా టికెట్స్ ఇష్యూ మ్యాటర్ తీస్తూనే సీఎం జగన్ గురించి ఒకే ఒక్క మాట అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu సీఎం జగన్ గురించి ఒకే ఒక్క మాట: పోసాని కృష్ణమురళి
Jagan- Posani


సినిమాలతో బిజీగా ఉంటూనే అటు రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనను కొనియాడుతున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్ సీఎం కావడమే లక్ష్యంగా రాజకీయ విప్లవం కొనసాగించిన ఆయన వైసీపీ అధికారం లోకి వచ్చాక జగన్ పాలనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతిలో మాట్లాడిన పోసాని.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి గురించి ఒకే ఒక్క మాట చెబుతా. రెండో ప్ర‌శ్నే అడ‌గడానికి వీల్లేదు అంటూ ఓపెన్ అయ్యారు.

''సినిమా టికెట్ల ఒక్క విషయమే కాదు అది ఏ విషయమైనా సీఎం జగన్ గారి గురించి ఒకే ఒక్క మాట. ఆయన దూరం నుంచి బ్ర‌హ్మ ప‌దార్థంలా క‌న‌బ‌డ‌తారు.. కానీ ద‌గ్గ‌రి నుంచి చూస్తే దేవుడి ప్ర‌సాదంలా క‌న‌ప‌డ‌తారు'' అన్నారు పోసాని కృష్ణమురళి. ప్రస్తుతం ఏడెనిమిది సినిమాలతో బిజీగా ఉన్నానని, తాను హీరోగా చేసిన ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. అలాగే ప్రస్తుతం రెండు మూడు టీవీ షోస్‌తో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాను శ్రీ‌వారి స‌న్న‌ధికి ఎన్నిసార్లు వ‌చ్చానో లెక్కే లేద‌ని చెబుతూ స్వామివారిపై ఉన్న భక్తిని బయటపెట్టారు.

ఇలాగే గతంలో చాలా సార్లు మీడియా ముఖంగా జగన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న పోసాని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆఫర్ కూడా వచ్చిందని, కానీ తానే తిరస్కరించానని అప్పట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. వైఎస్ పట్ల ఉన్న అభిమానంతో ఆ పార్టీ విజయాన్ని మాత్రమే కోరుకుంటూ ఏ పదవీ ఆశించలేదని అన్నారు. అందరిలా ఎగబడి పదవులు తీసుకునే అలవాటు తనకు లేదని చెప్పి అప్పట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పోసాని కృష్ణ మురళి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.