యాప్నగరం

రాజా.. ఒట్టేసి చెప్తున్నా జగన్ మంచోడు.. కాదంటే చెప్పుతో కొట్టండి: పోసాని

జగన్‌లోని నీతి నిజాయితీ, మాట మీద నిలబడే తత్వం, ఆయనలోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది అందుకే జగన్‌ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపానన్నారు ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత పోసాని పోసాని కృష్ణమురళి.

Samayam Telugu 26 May 2018, 5:54 pm
జగన్‌లోని నీతి నిజాయితీ, మాట మీద నిలబడే తత్వం, ఆయనలోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది అందుకే జగన్‌ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపానన్నారు ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత పోసాని పోసాని కృష్ణమురళి.
Samayam Telugu పోసాని, జగన్


పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఆయన వైసీపీ అధినేతపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మండే ఎండలో మూడు వేల కిలోమీటర్లు కాలినడకన నడవడం అనేది ఓ చారిత్రాత్మకం. జగన్ సంగల్పం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రజా సమస్యలు అనేవి ప్రజల్లోకి వెళితేనే తెలుస్తుందని ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అసాధారణం. నేను ఆయనతో కలిసి నేను రెండు, మూడు కిలోమీటర్లు కూడా నడవలేకపోయా. కాని ఆయన ఇన్ని వేళ కిలోమీటర్లు నడుస్తున్నారంటే ఆయనకు సంకల్పం ఎంత గట్టితో అర్ధం చేసుకోవచ్చు.

రాష్ట్ర ప్రజల పట్ల, రాజకీయాల పట్ల జగన్ లాంటి ఉన్నత పరిణితి చెందిన నేతను నేను ఎక్కడా చూడలేదు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. రాష్ట్రానికి సేవ చేయగల నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. జగన్ అంతకుముందు ముఖ్యమంత్రుల కంటే చాలా సమర్ధంగా కమిట్‌మెంట్‌తో పనిచేస్తారు. ఆయన అబద్ధపు హామీలను ఇవ్వడం లేదు. రాష్ట్రానికి ఏం చేయగలరో అదే చేస్తానంటున్నారు. అబద్దపు హామీలిచ్చి ప్రజలను మోసం చేయనని, అబద్దపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం ద్వారా వచ్చే అధికారం నాకు వద్దు అని జగన్ చెప్పిన మాటలు నచ్చాయి.
రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరం ఆయన్ని ఒకసారి గెలిపించండి. తరువాత మళ్లీ మళ్లీ మీరే ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తారు. దైవసాక్షిగా.. నా కుటుంబ సాక్షిగా.. నా మీద ఒట్టు వేసుకుని చెబుతున్నా జగన్ చాలా మంచివాడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన అన్ని అర్హతలు జగన్‌లో చూశా. రాష్ట్రానికి ఏదైనా చేయలనే తపన జగన్‌లో చూశా. ఆయనటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. జగన్ అంతకుముందు ముఖ్యమంత్రుల కంటే చాలా సమర్ధంగా పనిచేస్తారు. లేకపోతే నన్ను చెప్పుతో కొట్టండి.

అబద్ధపు హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు.. రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. టీడీపీ ప్రభుత్వంతో సాధ్యం కానిది వైఎస్ జగన్‌తోటే సాధ్యం అవుతుందన్నారు. అయితే తాను ఈరోజు జగన్ పాదయాత్రలో పాల్గొనడంలో రాజకీయ స్వలాభం ఏమీ లేదని.. ఎలాంటి పదవులూ ఆశించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులను ఆశించడం లేదన్నారు పోసాని కృష్ణమురళి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.