యాప్నగరం

‘అరవింద’ అదరహో.. ఉబ్బితబ్బిబ్బవుతోన్న పూజా హెగ్డే

‘అరవింద సమేత’లో తన పాత్రకు సోషల్ మీడియాలో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండటంతో పూజా ఆనందానికి అవధుల్లేవు. తనను పొగుడుతూ ఒక్కొక్కరు చేస్తున్న ట్వీట్లకు పూజా రిప్లైలు ఇస్తోంది.

Samayam Telugu 11 Oct 2018, 12:23 pm
ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. నాలుగేళ్ల క్రితం ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై బ్యూటీ అటు హిందీ, ఇటు తెలుగులోనూ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. ‘దువ్వాడ జగన్నాథం’లో అల్లు అర్జున్ పక్కన నటించినా ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో పూజా పాత్రకు గుర్తింపు రాలేదు. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా మెరిసి అందరినీ అలరించింది. అయితే ఇప్పుడు ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం మాత్రం పూజా హెగ్డేకు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా జపం జరుగుతోంది.
Samayam Telugu Pooja


ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో అరవిందగా పూజా హెగ్డేకు మంచి పాత్ర దక్కింది. హీరోయిన్లంటే పాటలకే పరిమితమైపోతున్న ఈ రోజుల్లో కథకే ప్రధానమైన పాత్రలో పూజాకు అవకాశం రావడం నిజంగా గొప్పే. అయితే ఆ పాత్రలో పూజా అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ఇంత వరకు ఈ నటన ఎక్కడ దాచావంటూ పొగిడేస్తున్నారు. పూజా హెగ్డే అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసిందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలాంటి నటన పూజా నుంచి ఊహించలేదని, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తన పాత్రకు సోషల్ మీడియాలో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండటంతో పూజా ఆనందానికి అవధుల్లేవు. తనను పొగుడుతూ ఒక్కొక్కరు చేస్తున్న ట్వీట్లకు పూజా రిప్లైలు ఇస్తోంది. తనను ఆకాశానికి ఎత్తుతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతోంది. మొత్తానికి ఉబ్బితబ్బిబ్బవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.