యాప్నగరం

కాటమరాయుడుగా కల్యాణ్

అత్తారింటికి దారేది చిత్రంలో పవన్‌కల్యాణ్‌ కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటలోని మొదటి అక్షరాలే పవన్ తాజా చిత్రం టైటిల్.

TNN 2 Sep 2016, 3:58 am
అత్తారింటికి దారేది చిత్రంలో పవన్‌కల్యాణ్‌ కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటలోని మొదటి అక్షరాలే పవన్ తాజా చిత్రం టైటిల్. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌కు సంబంధించి నిర్మాత శరత్‌మరార్‌ ఓ ప్రకటన చేశారు. ‘కాటమరాయుడు’ పేరుతో పవన్‌ సినిమాను నిర్మించనున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ‘గోపాల గోపాల’ దర్శకుడు కిశోర్‌కుమార్‌ పార్దసాని(డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి ఫ్యాక్షనిస్టు ప్రేమకథను అందించారు. కాగా తన పుట్టిన రోజున రాజకీయ, సినీ రంగ ప్రముఖులకు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నాడట. అంతేకాదు.. ఎవరూ ఎలాంటి వేడుకలు జరపొద్దని, హంగామా, హడావుడి చేయొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్‌లు పంపాడని టాక్. సేవా కార్యక్రమాలు చేస్తే ఫర్వాలేదు కానీ.. భారీ కేక్ కటింగ్ లాంటివి మాత్రం పెట్టొద్దని అభిమానులకు సూచించాడట.
Samayam Telugu power star pawan kalyan new movie title as katama rayuda says sharrath marar
కాటమరాయుడుగా కల్యాణ్

Wishing our #katamarayudu a very Happy Birthday! #HBDPawankalyan #PSPK @PawanKalyan . Watch the title poster. Enjoy! https://t.co/hWa5JrDAqf— Sharrath Marar (@sharrath_marar) September 1, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.