యాప్నగరం

‘కొడకా.. కోటీశ్వరా’.. పాటందుకున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరగనుంది.

TNN 21 Nov 2017, 4:46 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరగనుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలో 'బైటికొచ్చి చూస్తే' అనే పాటను త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పాట అటు మాస్ ఆడియన్స్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది.
Samayam Telugu power star pawan kalyan to sing in pspk25 movie
‘కొడకా.. కోటీశ్వరా’.. పాటందుకున్న పవన్


అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడబోతున్నాడనే మాటలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం నిజంగానే పవన్ ఈ సినిమాలో తన గొంతు వినిపించబోతున్నాడని తెలుస్తోంది. 'కొడకా కోటీశ్వరవా..' అనే సాహిత్యంతో ఈ పాట సాగబోతుంది. గతంలో కూడా పవన్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడా’ అనే పాట పాడాడు. ఆ పాటతో పాటు సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్‌తో పవన్ తో పాట పాడించే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.