యాప్నగరం

మళ్లీ ప్రభాస్, రాజమౌళి కాంబోలో..!

‘బాహుబలి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా? ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా

TNN 29 Jul 2017, 9:02 am
‘బాహుబలి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా? ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందనుందా? సుధీర్ఘకాలం పాటు పని చేసి ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాలను రూపొందించిన వీళ్లిద్దరూ మరో సినిమాకు జతకలవనున్నారా? అంటే.. ఔను అనే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘సాహో’తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు, అలాగే దీని తర్వాత కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.
Samayam Telugu prabhas and rajamouli combo to repeat
మళ్లీ ప్రభాస్, రాజమౌళి కాంబోలో..!


ఇక రాజమౌళి తదుపరి సినిమా ఏమిటనే అంశంపై క్లారిటీ లేదు. బహుశా.. ఎన్టీఆర్ తో ఉండవచ్చనే మాట వినిపిస్తోంది. అలాంటి ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత ప్రభాస్, రాజమౌళి కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం.

దీనికి పాయింట్ కూడా అనుకున్నారట. ‘బాహుబలి-2’ సెట్స్ మీదే అందుకు సంబంధించిన డిస్కషన్ చేశారట. ప్రభాస్ కు కూడా కాన్సెప్ట్ నచ్చిందని.. చేద్దామనే అనుకుంటున్నారని సమాచారం. అన్నీ కుదరితే.. ప్రస్తుతం వీరి చేతుల్లోని ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత ఆ సినిమా కోసం మళ్లీ కలవనున్నారని తెలుస్తోంది. ‘ఛత్రపతి’,‘బాహుబలి-1,2’ తర్వాత ఆ విధంగా వీరి కాంబో రిపీట్ కానున్నదని, దీనికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.