యాప్నగరం

సుజీత్‌పై సీరియస్ అయిన ప్రభాస్!

ప్రభాస్ అంటేనే చాలా కూల్ మనిషి అని, అందరిని డార్లింగ్ అని పిలుస్తూ అందరిచేత అలాగే పిలిపించుకోవడానికి....

TNN 11 May 2017, 9:01 pm
ప్రభాస్ అంటేనే చాలా కూల్ మనిషి అని, అందరిని డార్లింగ్ అని పిలుస్తూ అందరిచేత అలాగే పిలిపించుకోవడానికి ఇష్టపడతారనేది ఆయనకి వున్న పేరు. కానీ అటువంటి ప్రభాస్ ఓ సందర్భంలో డైరెక్టర్ సుజీత్‌పై సీరియస్ అయ్యారంటే నమ్మగలమా! కానీ నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఈ విషయం చెప్పిందో ఇంకెవరో కాదు.. స్వయంగా సుజీత్ వెల్లడించాడు.
Samayam Telugu prabhas scolded director sujeeth for not completing script
సుజీత్‌పై సీరియస్ అయిన ప్రభాస్!


'రన్ రాజా రన్' సినిమా హిట్ అయిన తర్వాత తన కోసం కూడా ఓ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడు ప్రభాస్. అయితే, అదేదో సరదాకి అంటున్నాడేమోలే అని భావించిన సుజీత్ ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదట. కానీ ప్రభాస్ మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడట. కొంతగ్యాప్ తర్వాత స్క్రిప్ట్ గురించి అడిగిన ప్రభాస్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదట సుజీత్‌కి. దీంతో సుజీత్ తీరుపై ఆగ్రహించిన ప్రభాస్.. స్క్రిప్ట్ పూర్తి చేయనందుకు సీరియస్ అయ్యాడట. పని విషయంలో ప్రభాస్ సీరియస్‌నెస్ గురించి చెబుతూ అతడు తనపై కోప్పడిన సంగతిని బయటపెట్టాడు సుజీత్.

ప్రభాస్ సీరియస్ అయిన తర్వాతే 'బాహుబలి: ది బిగినింగ్' పూర్తి కావడం కన్నా ముందే తాను స్క్రిప్ట్ రెడీ చేసి వినిపించడం, ఇచ్చిన మాట ప్రకారమే ప్రభాస్ ఆ స్క్రిప్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయని గతాన్ని గుర్తుచేసుకున్నాడు సుజీత్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.