యాప్నగరం

ప్రభాస్ అన్నయ్యగా దొరకడం మా అదృష్టం

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి, సాయి ప్రసీద అనే ముగ్గురు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కుటుంబంలో ఒక్కగానొక్క వారసుడు ప్రభాస్.

TNN 7 Aug 2017, 7:32 pm
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి, సాయి ప్రసీద అనే ముగ్గురు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కుటుంబంలో ఒక్కగానొక్క వారసుడు ప్రభాస్. తన చెల్లెళ్లను ప్రభాస్ చాలా ప్రేమగా చూసుకుంటాడట. ఈరోజు (సోమవారం) రక్షాబంధన్ సందర్భంగా ప్రభాస్ సోదరి సాయి ప్రకీర్తి ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Samayam Telugu prabhas sisters reveals about his secrets in rakhi special
ప్రభాస్ అన్నయ్యగా దొరకడం మా అదృష్టం


అన్నయ్య మాతో చాలా క్లోజ్ గా ఉంటారు. సినిమాల షూటింగ్స్‌లో గ్యాప్ దొరికితే ఎక్కువ సమయం మాతో గడపడానికి ఇష్టపడతారు. మేమంటే ఆయనకు ఎంత ప్రేమో, ఆయనంటే మాకు అంత గౌరవడం. మా ఇష్టాలను గౌరవిస్తాడు. ఫారెన్‌కు వెళ్తే మా ఇష్టాలను తెలుసుకొని సర్ప్రైజ్ గిఫ్టులు గుర్తుపెట్టుకొని మరీ తీసుకొస్తుంటాడు. అందరిలానే మేము కూడా అన్నయ్య పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం.

ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వలన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఏరోజున జరుగుతుందనే విషయాలు మాకు కూడా తెలియడం లేదని అన్నారు. అలానే అన్నయ్య చాలా వ్యక్తి అని, తమ జీవితంలో చూసిన ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్‌లో అన్నయ్య ఒకరని, తను మాకు అన్నయ్యగా దొరకడం మా అదృష్టమని తమతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.