యాప్నగరం

అంబానీ ఇంట పెళ్లి.. ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం!

ఈషా అంబానీ పెళ్లికి ‘బాహుబలి’ ప్రభాస్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 10 Dec 2018, 4:37 pm
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, నీతా దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ వివాహం ఈ నెల 12న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. అజయ్‌ పిరమాల్‌- స్వాతి పిరమాల్‌ల కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌.. ఈషాను వివాహం చేసుకోనున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించిన సంగీత్‌లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. షారుక్‌ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, కత్రినాకైఫ్‌, కరీనా కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ వేసిన స్టెప్పులతో ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ హోరెత్తిపోయింది. హాలీవుడ్‌ పాప్‌ గాయని బియాన్స్‌, బాలీవుడ్‌ నటీమణి రేఖతో పాటు సచిన్‌ టెండూల్కర్‌, ఆయన భార్య అంజలి కూడా పాల్గొన్నారు.
Samayam Telugu prabhas


అంబానీ ఇంట వివాహ వేడుకల్లో బాలీవుడ్ తారలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తారు? అన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. అయితే దీనికి సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈషా అంబానీ పెళ్లికి ‘బాహుబలి’ ప్రభాస్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాఫీ విత్ కరణ్ కార్యక్రమం షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ 12వ తేదీన ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.