యాప్నగరం

‘PD’ పచ్చబొట్టూ చెరిగీ పోదులే.. ఓ నయన్

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన 'వేలైక్కారన్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకాదరణ లభించింది.

TNN 31 Oct 2017, 7:42 pm
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన 'వేలైక్కారన్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో నుండి నయన్‌కు సంబంధించిన ఓ స్టిల్‌ను రిలీజ్ చేశారు. వైట్ డ్రెస్‌లో నయన్ దర్శనమిచ్చి అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఆమె చేతిపై ఉన్న టాటూ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. PD అనే అక్షరాలతో టాటూ వేయించుకుంది నయన్. గతంలో ఆమె ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు అతడి పేరును ఇలా రెండు అక్షరాలుగా పచ్చబొట్టు వేయించుకుంది. ఆ తరువాత వారిద్దరికి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.
Samayam Telugu prabhudeva tattoo is still on nayanthara hands
‘PD’ పచ్చబొట్టూ చెరిగీ పోదులే.. ఓ నయన్



ప్రస్తుతం ఆమె దర్శకుడు విజ్ఞేష్ శివన్‌తో ప్రేమలో మునిగితేలుతోంది. వీరిద్దరు రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని అంటున్నారు. ఆ విషయంలో ఎంతవరకు నిజముందో.. తెలియదుకాని.. ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ ఆమె గతంలో వేయించుకున్న టాటూ మాత్రం తీయించలేదు. ఈ విషయంలో విమర్శలు ఎదురైనా.. వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు నయన్. ఎవరేం అనుకున్నా తనకు నచ్చినట్లుగా జీవిస్తుంది ఈ సీనియర్ బ్యూటీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.