యాప్నగరం

పవన్.. గబ్బర్ సింగ్-3 వస్తుందా?

హిందీలో ‘దబంగ్ 3’కి రంగం సిద్ధం అవుతోంది.

Samayam Telugu 10 Mar 2018, 5:24 pm
హిందీలో ‘దబంగ్ 3’కి రంగం సిద్ధం అవుతోంది. మూడో పార్టుకు దర్శకుడు కూడా ఖరారు అయ్యాడు. అతడెవరో కాదు.. ప్రభుదేవా. ఇది వరకూ సల్మాన్ తో ‘పోకిరి’ రీమేక్ ‘వాంటెడ్’కు దర్శకత్వం వహించిన ప్రభుదేవ ఇప్పుడు సల్లూ సూపర్ హిట్ దబంగ్ కు మూడో పార్టును తీయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ప్రభుదేవ ధ్రువీకరించాడు. సల్మాన్ తో సినిమా అంటే అంతకన్నా ఆనందం లేదని ప్రభుదేవ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu prabhudheva to helm salman khan sonakshi sinha starrer
పవన్.. గబ్బర్ సింగ్-3 వస్తుందా?


హిట్లూ ఫ్లాఫ్ లకు అతీతమైన హీరో సల్లూ అని కితాబిచ్చాడు. దబంగ్ తొలి పార్టు 2010లో వచ్చింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు దబంగ్-2 వచ్చింది. తొలి పార్టు సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ కలెక్షన్ల చరిత్రను కొత్తగా లిఖించింది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లోకూడా రీమేక్ అయ్యింది. ఇక్కడా విజయవంతమైంది.

ఇక హిందీలో దబంగ్-2 వచ్చింది. ఇదీ హిట్ అయ్యింది. అయితే ఫస్టు పార్టు రేంజ్ లో కాదు. కానీ.. ఇప్పుడు మూడో పార్టుకు రెడీ అవుతున్నారట. మూడో పార్టులో కూడా నటీనటులంతా వాళ్లే ఉంటారని... దర్శకుడు మాత్రం ప్రభుదేవా అని తెలుస్తోంది. మరి తెలుగులో దబంగ్ కురీమేక్ గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా సర్ధార్ గబ్బర్ సింగ్ వచ్చింది. హిందీలో మూడో పార్టు వస్తోంది..తెలుగులో కూడా గబ్బర్ సింగ్ -3 వస్తుందా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.