యాప్నగరం

టెంపుల్‌లో ప్రకాష్ రాజ్ రియల్ ఫైట్!

నేను మోనార్క్‌ని నాకు అన్నీ తెలుసూ.. నన్నెవరూ మోసం చేయలేరు. ఇది సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్. ఆయనకు అన్నీ తెలుసుకదా! అని రియల్ లైఫ్‌లో ఓ జర్నలిస్ట్ జల్లికట్టు గురించి ప్రశ్నించే సరిగా ఆయనలో ఉన్న విలనిజం బయటకు వచ్చేసింది.

TNN 23 Jan 2017, 7:07 pm
నేను మోనార్క్‌ని నాకు అన్నీ తెలుసూ.. నన్నెవరూ మోసం చేయలేరు. ఇది సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్. ఆయనకు అన్నీ తెలుసుకదా! అని రియల్ లైఫ్‌లో ఓ జర్నలిస్ట్ జల్లికట్టు గురించి ప్రశ్నించే సరిగా ఆయనలో ఉన్న విలనిజం బయటకు వచ్చేసింది. పిచ్చి ప్రశ్నలు ఏంటంటూ.. ఫైటింగ్‌కి దిగాడట ప్రకాష్ రాజ్.
Samayam Telugu prakash raj angry with journalist in jallikattu issue
టెంపుల్‌లో ప్రకాష్ రాజ్ రియల్ ఫైట్!


తండ్రి పాత్రలో నటించాలన్నా, ప్రతినాయకుడి పాత్రలో విలనిజం పండించాలన్న ప్రకాష్ రాజ్ తరువాతే ఎవరైనా అనే రేంజ్‌లో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ మధ్య కాలంలో జగపతిబాబు ఎంట్రీతో విలన్‌గా అవకాశాలు తగ్గినా.. తాజాగా శతమానం భవతిలో హీరోకి తాతయ్యగా నటించి అలరించాడు.

ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో సినిమాల్లో నటించడం తగ్గించి దర్శకత్వంపై ఎక్కువగా ఫోకస్ పెట్టి 'మనవూరి రామాయణం' సినిమాను తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలను పొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందనే లభించింది.

ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్‌కు కాస్త కోపం ఎక్కువనే చెప్పాలి. గతంలో చాలా టీవీ షోలలో సైతం యాంకర్స్ పై విరుచుకుపడ్డారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తిరుమలలో చోటుచేసుకుంది. ప్రస్తుతం చెన్నైలో జరుగుతోన్న జల్లికట్టు వివాదానికి మీరు మద్ధతుగా నిలుస్తారా? అని తిరుమల వచ్చిన ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించిన ఓ జర్నలిస్ట్‌కు మొదటగా ప్రస్తుతం నేను ఫ్యామిలీ ఫంక్షన్‌లో బిజీగా ఉన్నానని సమాధానం ఇచ్చారు.

దీంతో ఆయన నోటివెంట సరైన సమాధానం చెప్పించాలని ప్రయత్నించిన జర్నలిస్ట్‌పై ఆయన చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అడిగిన ప్రశ్నే పదే పదే అడగడం ప్రకాష్ రాజ్ ఆగ్రహానికి కారణమైంది. అక్కడ ఉన్న మరికొందరు ఆ ఇష్యూలో కలగజేసుకోవడంతో కథ సుఖాంతం అయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.