యాప్నగరం

మోహన్ బాబు అమ్మ ** బూతులు తిట్టారు.. మంచు విష్ణు వచ్చి!! షాకింగ్ విషయాలు బయటపెట్టిన బెనర్జీ

Mohan Babu: 'మా' ఎలక్షన్ మొదలు హీటెక్కిన వాతావరణం రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది. తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Samayam Telugu 12 Oct 2021, 5:43 pm
'మా' ఎలక్షన్ మొదలు హీటెక్కిన వాతావరణం రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది. మొన్న జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు గెలుపొందడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 'మా' బిడ్డలం అంటూ బరిలోకి దిగి ఓటమి చవిచూసిన ప్రకాష్ రాజ్.. నేడు (మంగళవారం) ప్రెస్ మీట్ పెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మా' సంక్షేమం కోసం తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Samayam Telugu మోహన్ బాబు అమ్మ ** బూతులు తిట్టారు..
Mohan Babu Benerjee


అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన బెనర్జీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పలు సీక్రెట్స్ రివీల్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. ''ఎన్నికల ముందు నేను చాలా సహించాను. ఎలక్షన్ స్పీచెస్‌లో నరేష్ గారు నన్ను చాలా మాటలు అన్నారు. నేను గెలిచిన తర్వాత అంతా కంగ్రాట్స్ అని చెబుతున్నా కూడా సంతోషం లేదు. నేను మూడు రోజుల నుంచి మానసిక క్షోభ అనుభవిస్తున్నా.
ATMAA ‘మా’లో చీలిక.. కొత్త అసోసియేషన్ ATMA ఏర్పాటు? నాగబాబు, ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎలక్షన్ రోజు దూరంగా నిల్చున్నా. మోహన్ బాబు గారు తిడుతున్నారు. విష్ణు దగ్గరికి వెళ్లి గొడవలు వద్దు నానా అన్నా. అప్పుడు మోహన్ బాబు గారు కొడతానికి వచ్చారు. అరగంట సేపు వందల మంది మధ్యలో అమ్మ ** బూతులు తిట్టారు. విష్ణు బాబు నన్ను లాగేసి సారీ చెప్పారు. మోహన్ బాబు ఇంట్లో మనిషిని నేను. లక్ష్మిని ఎత్తుకొని తిరిగాను. నాకు చాలా చాలా బాధేసింది. ఈ అవమానంతో బతకడం ఎందుకని తర్వాతి రోజు ఉదయాన్నే వెళ్లి రాజీనామా చేద్దామనుకున్నా. మోహన్ బాబు వైఫ్ కూడా ఫోన్ చేసి చాలా బాధపడింది. ఇవ్వాళ నేను రిజైన్ చేసి బయటకు వస్తున్నా.. సారీ'' అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.