యాప్నగరం

Zombie Reddy First look: భయపెట్టడంలోనూ వినూత్నం.. ప్రశాంత్ వర్మ టాలెంట్ భలే ఉందే!!

అనుకున్నట్లుగానే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి టాలెంట్ బయటపెట్టాడు. కరోనా వైరస్ నేపథ్యంలో తన మూడో సినిమా ఉంటుందని ప్రకటించిన ఆయన ఆ సినిమాకు 'జోంబీ రెడ్డి' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఆసక్తిరేకెత్తించారు.

Samayam Telugu 8 Aug 2020, 10:22 am
మొదటి సినిమా 'అ' ద్వారానే విభిన్న చిత్రాలను రూపొందించడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఎంత లేట్ అయినా పర్వాలేదు గానీ సెలెక్టెడ్ సినిమాలు, విలక్షణమైన కథాంశాలు ఎన్నుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్న ఈ యువ దర్శకుడు 'కల్కి' అంటూ రెండో సినిమాను రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక మూడో సినిమా మరింత డిఫరెంట్‌గా ఉండాలని ప్లాన్ చేసిన ఆయన.. లేటెస్ట్ ఇష్యూ కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాను ప్రకటించారు.
Samayam Telugu జోంబీ రెడ్డి ఫస్ట్ లుక్: భయపెట్టడంలోనూ వినూత్నం..
Zombie Reddy First look


కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. దానికి 'జోంబీ రెడ్డి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జోంబీ అనే ఓ స్మశాన వాటికను చూపిస్తూ భయపెట్టిన ఆయన ఆ స్మశానంలోని వాతావరణం, ఎరుపు రంగులో ఉన్న చంద్రుడు.. బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మరింత భయపెట్టారు. థ్రిల్లింగ్, హారర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి వినూత్నంగా భయపెట్టబోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: నగ్నంగా బిగ్ బాస్ బ్యూటీ! బాత్ రూమ్‌ ఫోటో షేర్ చేసి షాకిచ్చిన హీరోయిన్

అయితే కరోనా నేపథ్యంలో సినిమా ఉంటుందని చెప్పిన ప్రశాంత్ వర్మ.. ఇలా ‘జోంబీ రెడ్డి’ డిఫరెంట్ టైటిల్ ప్రకటించడంతో అందరిలోనూ సరికొత్త ఆసక్తి నెలకొంది. ఈ పోస్టర్ చూశాక.. అసలు కరోనాకు జోంబీ రెడ్డి సంబంధం ఏంటి? ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు? అనే కోణంలో చర్చలు మొదలు పెట్టేశారు జనం. నిజంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ ద్వారా ప్రశాంత్ వర్మ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నాడనే దానిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.

ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ జోంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు, ఇతర వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.