యాప్నగరం

బుర్రకి పదును.. ‘బాబు బాగా బిజీ’ పోస్టర్

ఒకవైపు రోజా పువ్వు, మరో వైపు అరటి పండు ఉంది. హీరో దేన్ని తొలుత ఎంచుకోవాలనే

TNN 11 Mar 2017, 9:17 am
అవసరాల శ్రీనివాస్ మరోసారి తన స్టైల్ వినోదంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైపోతున్నాడు. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘బాబు బాగా బిజీ’ సినిమా ప్రీ లుక్ పోస్టర్ హోలీ సందర్భంగా విడుదలైంది. ఈ పోస్టర్‌లో ఒకవైపు రోజా పువ్వు, మరో వైపు అరటి పండు ఉంది. హీరో దేన్ని తొలుత ఎంచుకోవాలనే సంశయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
Samayam Telugu pre look baabu baaga busy
బుర్రకి పదును.. ‘బాబు బాగా బిజీ’ పోస్టర్


ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్‌కి జోడీగా.. తేజశ్వి, మిస్త్రీ చక్రవర్తి, శ్రీముఖిలను ఎంచుకున్నట్లు సమాచారం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. పోస్టర్‌ సరికొత్తగా ఉండటం.. దీనికి తోడు ‘కుమ్ముడే.. కుమ్ముడు’ అంటూ క్యాప్షన్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.