యాప్నగరం

స్విమ్మింగ్ పూల్‌లో సమీరా రెడ్డి.. ప్రెగ్నెన్సీ‌ని ఎంజాయ్ చేస్తూ..!

ప్రస్తుతం సమీరా రెడ్డి ఐదు నెలల గర్భవతి. ఇప్పటికే తాను గర్భవతినని సమీరా ప్రకటించింది. తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఫొటోలు కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది.

Samayam Telugu 9 Apr 2019, 10:41 am
సమీరా రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత నటి. రాజమండ్రిలో పుట్టి ముంబైలో పెరిగిన తెలుగమ్మాయి. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమీరా రెడ్డి.. ఆ తరవాత ‘జై చిరంజీవ’, ‘అశోక్’ సినిమాల్లో నటించింది. చివరిగా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించింది. ఆ తరవాత 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వార్దేను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. ఏడాది తరవాత మగబిడ్డకు జన్మనిచ్చిన సమీరా.. కుటుంబ, వ్యాపార బాధ్యతలతో బిజీ అయిపోయింది. తాను సినిమాలకు దూరమైనప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఇప్పటికీ టచ్‌లోనే ఉంది ఈ మాజీ బ్యూటీ.
Samayam Telugu Sameera_Reddy


ప్రస్తుతం సమీరా రెడ్డి ఐదు నెలల గర్భవతి. ఇప్పటికే తాను గర్భవతినని సమీరా ప్రకటించింది. తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఫొటోలు కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాటలు ఆడుతోన్న ఫొటోను సమీరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికీ తన స్విమ్ సూట్ బాగా ఫిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. సమీరా తన రెండో బిడ్డకు జూలైలో జన్మనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె కుమారుడి వయసు నాలుగేళ్లు.

కాగా, గతంలో తాను గర్భం దాల్చినట్లు వెల్లడిస్తూ షేర్ చేసిన ఫొటోలను చూసి కొంత మంది సమీరాను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇలాంటి వారికి సమీరా కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ‘ట్రోలర్స్‌ను నేను ఒక విషయం అడగదలుచుకున్నా. మీరు ఎక్కడి నుంచి బయటికి వచ్చారు? మీరు కూడా తల్లి గర్భం నుంచే బయటికి వచ్చారని మరిచిపోకండి. మీరు గర్భం నుంచి బయటికి వచ్చేటప్పుడు మీ తల్లి చాలా హాట్‌గా కనిపించిందా? ప్రకృతిసిద్ధంగా జరిగే ఇలాంటి అందమైన, అద్భుతమైన చర్యను కించపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటు’ అంటూ సమీరా ఆగ్రహం వ్యక్తం చేసింది.
View this post on Instagram Take me back to Sunday!#mondaymotivation this Monday 🤠 #mood #holiday #floating #preggo #babybump #pregnancy #chill A post shared by Sameera Reddy (@reddysameera) on Apr 7, 2019 at 11:18pm PDT
View this post on Instagram Sunday Funday ! Just happy my swimsuit still fits me 🙃 #preggo #sundayfunday A post shared by Sameera Reddy (@reddysameera) on Apr 7, 2019 at 12:08am PDT
View this post on Instagram Monday be like 🌈 . . @jleibholz I’m lusting after these @dior Elliptic sunglasses ! . . #Monday #blues #preggo #babybump #swimsuit #momlife #bollywood #mom #keepingitreal A post shared by Sameera Reddy (@reddysameera) on Apr 8, 2019 at 1:09am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.