యాప్నగరం

అనంతపురం జిల్లా సమీపంలో 'ప్రేమభిక్ష'

అనంతపురం జిల్లాలోని భద్రపట్నం అనే గ్రామంలో ఓ ప్రేమ జంటకు పెద్దల నుంచి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలుపుతూ...

TNN 24 Oct 2016, 6:36 pm
అనంతపురం జిల్లాలోని భద్రపట్నం అనే గ్రామంలో ఓ ప్రేమ జంటకు పెద్దల నుంచి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలుపుతూ తెలుగులో 'ప్రేమభిక్ష' అనే సినిమా రూపుదిద్దుకుంటోంది.
Samayam Telugu prema bhiksha telugu film shooting going on at kolar district
అనంతపురం జిల్లా సమీపంలో 'ప్రేమభిక్ష'


అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం. ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి న షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో శరవేగంగా జరుపుకుంటోంది .
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యదార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు. సగానికి పైగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈచిత్రం ఈ నెల 25 వరకు కోలార్ లో జరుగుతున్న షెడ్యూల్ తో కంప్లీట్ అవుతుంది' అని అన్నారు.
దర్శకుడు ఆర్ కె గాంధీ మాట్లాడుతూ.. 'ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా:దేవిశ్రీ గురూజీ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని అన్నారు . అలాగే ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ మా చిత్రం లో నటించడం మాకు గర్వకారణం.' అని అన్నారు. నవంబర్ మొదటివారంలో ఈ సినిమా ఆడియో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.