యాప్నగరం

SPY వచ్చాడోయ్: ఫ్యాన్స్ హంగామా

ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘స్పైడర్’ థియేటర్‌లో బుధవారం విడుదలై సందడి చేస్తుంది.

TNN 27 Sep 2017, 8:50 am
ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘స్పైడర్’ థియేటర్‌లో బుధవారం విడుదలై సందడి చేస్తుంది. దీంతో ఆయన అభిమానుల థియేటర్స్ వద్ద క్యూలు కట్టారు. తమ అభిమాన నటుడి మూవీ కోసం రాత్రి నుండే హంగామా చేస్తున్నారు. అనేక చోట్ల ఇప్పటికే ప్రీమియర్స్ షో పడటంతో మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. మరోవైపు తొలిసారి ‘స్పైడర్’ మూవీతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న మహేష్‌కు తమిళనాడులో ఆయన సినిమాకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చుతూ, మహేష్ పోస్టర్స్‌కి పాలాభిషేకాలు చేస్తున్నారు.
Samayam Telugu prince mahesh babu fans hungama at spyder movie theatres
SPY వచ్చాడోయ్: ఫ్యాన్స్ హంగామా


ఇప్పటికే ఈ మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుకావడంతో థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్‌లు దర్శనం ఇస్తున్నాయి. బుకింగ్స్ మొదలు పెట్టిన కొద్దిసేపట్లోనే హౌస్ ఫుల్ కావడంతో మరికొన్ని థియేటర్‌ను పెంచారు. ప్రపంచ వ్యాప్తంగా మహేష్ కెరియర్లో అత్యధిక స్క్రీన్స్పై 'స్పైడర్' మూవీ ప్రదర్శించబడుతుంది.

తారాగణం: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె సూర్య, భరత్ తదితరులు
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు

#SPYder celebrations started..... #SPYderDay pic.twitter.com/ZsI7q5xqJ3 — #SPYderDay (@SpyderTheMovie) September 26, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.