యాప్నగరం

భామాకలాపం: వెరీ డేంజరస్ హౌస్ వైఫ్ ప్రియమణి!

BhamaKalapam Teaser: ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'భామాకలాపం' టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ వీడియో వదిలారు.

Samayam Telugu 24 Jan 2022, 4:15 pm
టెక్నాలజీ విస్తరణలో భాగంగా క్రమంగా ఓటీటీలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఆన్ లైన్ వేదికపై సినిమాలు, వెబ్ సిరీసులు, రియాలిటీ షోస్ చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా, ప్రియమణి లాంటి స్టార్ హీరోయిన్స్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. ఈ నేపథ్యంలోనే ప్రియమణి మరో అడుగు ముందుకేసింది.
Samayam Telugu వెరీ డేంజరస్ హౌస్ వైఫ్ ప్రియమణి!
Priyamani


ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ప్రియమణి.. ఇప్పుడు 'ఆహా' తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌పైకి 'భామాకలాపం' అనే సినిమాతో రాబోతోంది. అభిమన్యు తడిమేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న 'ఆహా'లో ఈ సినిమా ప్రసారం కానుంది. అయితే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న యూనిట్ సభ్యులు తాజాగా 'భామాకలాపం' టీజర్ వదిలి సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశారు.
బంగార్రాజు 10 డేస్ కలెక్షన్స్.. మళ్ళీ పుంజుకున్న వసూళ్లు
ఒక నిమిషం 29 సెకనుల నిడివితో ఈ టీజర్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు. 'మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించొచ్చు.. కానీ పక్కవాళ్ల గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు' అని ప్రియమణి చెప్పిన డైలాగ్ ఆమె క్యారెక్టర్‌ని డిఫైన్ చేస్తోంది. ఓ హౌస్ వైఫ్, మర్డర్ కేసు చుట్టూ తిరిగే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందించారని స్పష్టమవుతోంది. సో.. చూడాలి మరి ఈ డిఫరెంట్ కథతో 'ఆహా' టీం ఏ మేర అలరిస్తుందనేది!.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.