హాలీవుడ్లో బిజీగా ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రేమలో పడిందా? ఒక హాలీవుడ్ నటుడితోనే ఈమె ప్రేమాయణాన్ని సాగిస్తోందా? ఇందుకు సంబంధించిన రూమర్లు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. అమెరికాలోనే ప్రియాంక ఒక ప్రేమకథను నడిపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌తో ప్రియాంక ప్రేమలో పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మేరకు ఈ ప్రేమ అంశంపై బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో ప్రియాంకపై ఇలాంటి రూమర్లేవీ చెలరేగలేదు. దశాబ్దంన్నర కిందట నుంచి హీరోయిన్గా బిజీగానే ఉన్న ప్రియాంకపై ఇలాంటి రూమర్లు రాలేదు. మరీ గాలి కబుర్లను పక్కన పెడితే.. ఫలానా హీరోతో లేదా ఫలానా వ్యాపారవేత్తతో.. అనే ప్రచారాలేవీ ప్రియాంక విషయంలో జరగలేదు.
అయితే ఇప్పుడు ఈమె విషయంలో ప్రచారం గట్టిగానే జరుగుతోంది. సోషల్ మీడియాలో నిక్ ఫొటోలకు ప్రియాంక పెడుతున్న కామెంట్లు ఈ రూమర్లకు ఊపునిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలు ఊరంతా వినిపిస్తున్నా.. ప్రియాంక మాత్రం స్పందించడం లేదు. ప్రేమకథను నడిపిస్తున్న విషయాన్ని ధ్రువీకరించడం లేదు అలా అని ఖండించడమూ లేదు.
అయితే వీరిద్దరి మధ్యన వయసులో చాలా వ్యత్యాసమే ఉంది. ఆమె కన్నా అతడు చాలా చిన్నవాడు. కాబట్టి వీరిది ప్రేమనా? లేక స్నేహమేనా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.