యాప్నగరం

హాలీవుడ్ షూట్‌లో ప్రియాంకా చోప్రా స్టన్నింగ్ లుక్స్

క్వాంటికో టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా ఆ తర్వాతే బేవాచ్ సినిమాలో విలన్ రోల్...

Hindustan Times 20 Jun 2017, 5:25 pm
క్వాంటికో టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా ఆ తర్వాతే బేవాచ్ సినిమాలో విలన్ రోల్ పోషించే అవకాశం దక్కించుకుంది. బేవాచ్ సినిమాలో తన అందం, అభినయంతో హాలీవుడ్ ఆడియెన్స్‌ని కట్టిపడేసిన ప్రియాంకా చోప్రా.. ఆ సినిమా రిలీజైన కొద్ది రోజులకే మరో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ కనిపించింది.
Samayam Telugu priyanka chopra shoots for next hollywood film
హాలీవుడ్ షూట్‌లో ప్రియాంకా చోప్రా స్టన్నింగ్ లుక్స్


బ్రూక్లిన్‌లో జరుగుతున్న 'ఏ కిడ్ లైక్ జేక్ అనే సినిమా షూటింగ్ కోసం ఆరెంజ్ కలర్ దుస్తుల్లో లొకేషన్‌కి వచ్చిన ప్రియాంకా ఆ ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఆరెంజ్ కలర్ సమ్మరీ డ్రెస్సులో ప్రియాంకా చోప్రా స్టిన్నింగ్ లుక్స్ అద్దిరిపోయాయి.

బిగ్ బ్యాంగ్ థీయరి, హిడెన్ ఫిగర్స్ వంటి చిత్రాల ఫేమ్ జిమ్ పార్సన్స్, హోమ్‌ల్యాండ్, రోమియో+జూలియెట్ వంటి చిత్రాల్లో నటించిన నటి క్లేర్ డేన్స్ వంటి స్టార్స్‌తో కలిసి ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో నటిస్తోంది. సిలాస్ హోవర్డ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా పాత్ర ఏంటనేదే ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.