యాప్నగరం

ప్రియాంక చోప్రాకి ఎవరూ నచ్చడం లేదట

హాలీవుడ్ సినిమాలు, సీరియళ్లతో బిజీగా మారిపోయిన బాలీవుడ్ నటి ప్రియాంకి చోప్రా‌ ప్రేమించేందుకు ఎవరూ నచ్చడం

TNN 8 Feb 2018, 9:34 am
హాలీవుడ్ సినిమాలు, సీరియళ్లతో బిజీగా మారిపోయిన బాలీవుడ్ నటి ప్రియాంకి చోప్రా‌ ప్రేమించేందుకు ఎవరూ నచ్చడం లేదట. పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దాటవేస్తున్నారు.. ఎవరినైనా ప్రేమిస్తున్నారా..? అని ప్రశ్నించగా.. ‘చాలా మందితో స్నేహం చేశాను. కానీ.. ప్రేమించేందుకు ఎవరూ నచ్చడం లేదు. అందుకే.. చాలా రోజుల నుంచి ఒంటరిగానే ఉంటున్నా. ఇప్పుడు సడన్‌గా ప్రేమించాలంటే మాత్రం కొంచెం టైమ్ పడుతుంది’ అని ప్రియాంక సమాధానమిచ్చింది.
Samayam Telugu priyanka chopras relationship status single but used to be in committed relationship
ప్రియాంక చోప్రాకి ఎవరూ నచ్చడం లేదట


గత రెండేళ్లుగా ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకోబోతుందన్న వార్త మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అప్పట్లో మీడియాపై రుసరుసలాడిన ఈ చిన్నది ‘నా చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ పెట్టుకున్న రోజు పెళ్లి గురించి చెప్తాను. అప్పటి వరకు అడగొద్దు’ అని మీడియాకి వార్నింగ్ ఇచ్చింది. తర్వాత కొద్దిరోజులకే సరైన జోడి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ మాట మార్చింది. తాజాగా.. తాను ఇంకా ఒంటరిగానే ఉన్నానంటూ నవ్వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.