యాప్నగరం

కేన్స్‌లో ప్రియాంకా చోప్రా సినిమా ఫస్ట్ లుక్

ప్రియాంకా చోప్రా నిర్మించిన సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జరిగింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే...

TNN 23 May 2017, 10:52 am
ప్రియాంకా చోప్రా నిర్మించిన సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జరిగింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే ఉత్తరాదిన ప్రాంతీయ భాషా చిత్రాలు నిర్మిస్తున్న ప్రియాంకా చోప్రా తాజాగా తన సొంత బ్యానర్‌పై సిక్కిం భాషలో తెరకెక్కించిన చిత్రం పహునా. మావోయిస్టు ఆందోళలన నేపథ్యంలో నేపాల్ నుంచి సిక్కింకి పారిపోయి వచ్చే క్రమంలో ముగ్గురు చిన్నారులు తమ తల్లిదండ్రుల నుంచి వేరై తప్పిపోతారు. ఆ తర్వాత వారు ఎదుర్కున్న కష్టాలేంటనేదే ఈ సినిమా కథాంశం. చిన్నారుల ధైర్య సాహసాలు, ప్రేమ, ఆప్యాయతల గురించి ఈ సినిమాలో ముఖ్యంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
Samayam Telugu priyanka chopras sikkimese production venture pahunas first look launched at cannes
కేన్స్‌లో ప్రియాంకా చోప్రా సినిమా ఫస్ట్ లుక్

.@purplepebblepictures Presents the 1st look of our Sikkimese film #Pahuna unveiled at Cannes.Directed by Paakhi A Tyrewala. @madhuchopra pic.twitter.com/fOTOATY4ic— PRIYANKA (@priyankachopra) May 22, 2017
కేన్స్‌లో జరిగిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచింగ్ ఈవెంట్‌కి ప్రియాంకా చోప్రా నేరుగా హాజరు కాలేకపోయినప్పటికీ.. తన తల్లి మధుచోప్రా, సోదరుడు సిద్ధార్థ్ చోప్రాలని తన తరుపున ప్రతినిధులుగా పంపించింది. పర్పుల్ పెబుల్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రియాంకా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచింగ్ కేన్స్ వేదికగా జరగడంతో సినిమాకి వరల్డ్ వైడ్ పబ్లిసిటీ వచ్చింది. కానీ ఈ సినిమాను ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా స్పష్టత లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.