యాప్నగరం

కురచ దుస్తులు.. ప్రియాంకను అలా పట్టుకున్నాడేంటి?

వెనుక నుంచి వాటేసుకుని.. గాల్లోకి ఎత్తేశాడు..

TNN 13 Jul 2017, 2:35 pm
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా తదుపరి సినిమా సెట్స్ మీదకు వచ్చింది. ‘Isn’t It Romantic?’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ న్యూయార్క్ లో మొదలైంది. ఇందుకు సంబంధించిన లీక్ అయిన ఒక స్టిల్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. పేరులోనే రొమాన్స్ ను కలిగిన ఈ సినిమాకు సంబంధించిన బోల్డ్ స్టిల్ ఇది. అసలే కురచటి దుస్తులు వేసుకున్న ప్రియాంకను వెనుకవైపు నుంచి వాటేసుకున్నాడు అతడు.
Samayam Telugu priyanka too hot to handle
కురచ దుస్తులు.. ప్రియాంకను అలా పట్టుకున్నాడేంటి?


ఈ ఫొటోలను సెట్స్ లో ఉన్నవాళ్లే ఎవరో నెట్ లో పెట్టారు. వీటిని చూసి మొదట ప్రియాంక మీద ఏదైనా దాడి జరిగిందా? అని కొంతమంది సందేహించారు. అయితే ఇవన్నీ కూడా ప్రియాంక హాలీవుడ్ లో నటిస్తున్న తాజా సినిమా స్టిల్స్ అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. షూటింగ్ లో భాగంగానే ఇది జరిగిందని స్పష్టమైంది.

ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. 2019 ఫ్రిబవరి 14న ఈ రొమాంటిక్ కామెడీని వీక్షించడానికి రెడీగా ఉండాలని దీని రూపకర్తలు ప్రకటించారు. మరి ఫస్ట్ స్టిల్స్ తోనే ప్రియాంక సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎలాగూ రొమాంటిక్ కామెడీ అంటున్నారు కాబట్టి.. ఇందులో ప్రియాంక గ్లామర్ షో ఎలా ఉండబోతోందో అనేది కూడా చర్చనీయాంశం అయ్యింది.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.