యాప్నగరం

Bandla Ganesh: భమ్ అని కార్లు పైకిలేస్తే జనాలు థియేటర్స్‌కు రారు.. ఇకనైనా తెలుసుకోండి: బండ్ల గణేష్

జనాలు సినిమా థియేటర్స్‌కు రావడం లేదంటున్న వారికి నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) కౌంటర్ ఇచ్చారు. మంచి కథా, కథనంతో అద్భుతంగా తెరకెక్కిస్తే.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 14 Aug 2022, 12:06 pm

ప్రధానాంశాలు:

  • నేను సినిమా కోసమే బతుకుతున్నా..
  • మంచి సినిమా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తారు
  • వంద కార్లు ఎగిరాయంటే హిట్ అవ్వదు: బండ్ల గణేష్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu producer bandla ganesh
బండ్ల గణేష్
జనాలు సినిమా థియేటర్స్‌కు రావడం లేదని గత కొద్ది రోజులుగా సినీ పెద్దలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలకు అలవాటు పడిపోవడంతో మూవీ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయని అంటున్నారు. అయితే ఇలా చెబుతున్న వారికి ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. తాను సినిమా కోసమే బతుకున్నానని చెప్పారు. ఎలాంటి సినిమాలు తీస్తే జనాలు థియేటర్స్‌కు వస్తారో కొన్ని సూచనలు చేశారు. ఆయన మాటల్లోనే..
'సినిమా.. సినిమా.. నా జీవితం సినిమా.. నాకు ఇష్టమైన పదం సినిమా. నేను సినిమా కోసం బతుకుతున్నా. ఈ మధ్య సినిమాలు ఆడటం లేదు. జనాలు థియేటర్స్‌కు రావడం లేదని గోల చేసి.. గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. పరభాష హీరో వచ్చి ఇక్కడ సూపర్ హిట్ కొట్టాడు. అలాగే మిడిల్ రేంజ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్, చిన్న హీరో నిఖిల్ తీసిని సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి.

మనం తెలుసుకోవాల్సిందేయ్యా అంటే.. మంచి కథా, కథనంతో అద్భుతంగా తెరకెక్కిస్తే.. ఎప్పుడైనా.. ఏ కాలమైనా అలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఆనందిస్తారు.. ఆస్వాదిస్తారు.. మనం బడ్జెట్లు పెంచుకుని.. వందల కోట్లు, వేల కోట్లతో తీసి.. వంద కార్లు ఎగిరాయి.. వంద టైర్లు ఎగిరాయి.. చేతిలో హీరో ఓ రాడ్ పట్టుకుని వెనుక ఓ వంద మందిని పెట్టుకుని భమ్ అని లేపితే జనాలు వస్తారునుకోవడం తప్పు.

గుండెకు హత్తుకునే.. జనాలు కుర్చోబెట్టగలిగే సినిమాలు తీసినంత కాలం మనకు అపజయం లేదు. ఈ బంద్‌లు, రేట్లు తగ్గించుకోవడం వంటివి కాకుండా మంచి సినిమా తీయడంపై దృష్టి పెడదాం. ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఆశీర్వదిస్తారు..' అంటూ బండ్ల గణేష్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.