యాప్నగరం

మార్చి 1 నుండి థియేటర్లు బంద్! షూటింగ్స్ కూడా..

తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 2018 మార్చి 1వ తేదీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

TNN 4 Jan 2018, 7:07 pm
తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 2018 మార్చి 1వ తేదీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరి వలన ఏర్పడుతున్న సమస్యలకు నిరసనగా థియేటర్లు మూసివేసి, సినిమా షూటింగ్స్ ఆపివేయాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి సంచలనం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే డిజిటర్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి సానుకూలమైన నిర్ణయం వస్తుందని వేచిచూసిన నిర్మాత మండలి వారినుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందుగా ప్రకటించనట్టే.. మార్చి 1నుండి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈమేరకు ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి సభ్యుడు సి. కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu producer c kalyan says theatres should be closed from march 1st
మార్చి 1 నుండి థియేటర్లు బంద్! షూటింగ్స్ కూడా..


డిజిటల్ సర్సీస్ ప్రొవైడర్ల‌తో చాలా సమస్యలు ఉన్నాయని వారితో చాలా సార్లు సంప్రదింపులు జరిపినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంద్‌కు దిగుతున్నామన్నారు. అనేక కష్ట నష్టాలను ఓర్చి సినిమాను కంప్లీట్ చేసిన తరువాత సెన్సార్‌కు పంపుతున్నామని అక్కడ మార్పులు, చేర్పులు చేసినందుకు గానూ.. యుఎఫ్ఓ, క్యూబ్ లాంటి సంస్థలు చార్జెస్ ఆడుతున్నాయని, దాని వలన కంటెంట్ ప్రొవైడర్స్‌కు లాభం లేకుండా పోతుందని ఈ పరిస్థితిలో మార్పు రావాలనే బంద్‌కు దిగుతున్నామన్నారు సి.కళ్యాణ్.

అయితే ఈ బంద్ జరిగితే ఇండస్ట్రీతో పాటు థియేటర్స్ యాజమాన్యాలు అందులో పనిచేసే కార్మికులు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నందున పరిస్థితులు అదుపులోకి వచ్చి.. బంద్ విరమించవచ్చని చాలా మంది ఆశావాదులు ఊహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.