యాప్నగరం

Liger: ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్న ఛార్మి.. అతను లేకుంటే..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆగస్టు 25న లైగర్ (Liger) మూవీ థియేటర్స్‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.

Authored byAshok Krindinti | Samayam Telugu 20 Aug 2022, 12:24 pm
లైగర్ (Liger) మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)తో నటి, ప్రొడ్యూసర్ ఛార్మి (Charmme Kaur) ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వారిద్దరు ఆమెతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఛార్మి కూడా లైగర్ మూవీ షూటింగ్‌ నిర్మాణంలో ఎదురైన కష్టాలను చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది.
Samayam Telugu Charmme kaur
నటి ఛార్మి


'2019 ఆగస్టులో నేను, పూరీ గారు నీకు (విజయ్ దేవరకొండ)కు కథ చెప్పాం. నువ్వు కథ వినగానే మెంటల్ ఉంది దింపుదాం అన్నావు. 2022 జనవరిలో 45 రోజులు ఫస్ట్ షెడ్యూల్‌లో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాం. ఆ తర్వాత ఫస్ట్ లాక్‌డౌన్, సెకెండ్ లాక్‌డౌన్స్ వచ్చాయి. షూటింగ్ ప్రారంభం కోసం విజయ్ చాలా ఎదురుచూశాడు. రెండేళ్లు బాడీని అలానే మెయింటెన్ చేశాడు. ప్రొడ్యూసర్‌గా మాకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు 95 శాతం నాకు నెగిటివ్స్ వినిపించాయి.

లాక్‌డౌన్‌లో డబ్బులు లేనప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్ వచ్చింది. జేబులో ఒక్క రూపాయి లేదు. అంతా భారీ ఆఫర్ రిజెక్ట్ చేసేందుకు దమ్ము కావాలి. అది నాకు పూరీ గారి వల్ల వచ్చింది..' అంటూ ఛార్మి కన్నీళ్లు పెట్టుకుంది. 'నీ కష్టం నాకు అర్థమైంది.. ఎన్ని సార్లు ఏడ్చి ఉంటావు..' అని పూరీ అడిగాడు. ఛార్మి కన్నీళ్లు ఆపులేక ఏడ్చేసింది.

'సినిమా రిలీజ్ చేయాలి. కోవిడ్ టైమ్. ఆ తరువాత వద్దామంటే ముందు తీసిన సినిమాలు ఉన్నాయి. ఎన్నో కష్టాల తరువాత ఆగస్టు 25న మీ ముందుకు వస్తున్నాం. ఈ మొత్తం ప్రయాణంలో నాకు, పూరీ గారికి విజయ్ దేవరకొండ ఎంతో స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. ఎప్పుడు ఏదీ అడగకుండా మాకు అండగా నిలబడ్డాడు. విజయ్ వల్లే లైగర్ మూవీ పూర్తయింది. మేం లైగర్‌ కంటెంట్‌ను నమ్మినాం. తప్పకుండా విజయం సాధిస్తుంది..' అని ఛార్మి అన్నారు. ఆ తరువాత విజయ్‌కు థ్యాంక్స్ చెబుతూ ఛార్మి హగ్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఛార్మిని విజయ్ ఓదార్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.