యాప్నగరం

మూవీ రివ్యూలు ఉండాల్సిందే- బడా నిర్మాత

సినిమా విడుదలైన గంటలోనే రివ్యూలు రాయడం వలన కలెక్షన్స్‌కు ఎఫెక్ట్ పడుతుందని కాబట్టి సినిమా విడుదలైన మూడు, నాలుగు రోజుల తరువాత సమీక్షలు ఇవ్వాలని ఇటీవల రజినీకాంత్, విశాల్ వంటి నటులు కోరారు.

TNN 18 Apr 2017, 4:34 pm
సినిమా విడుదలైన గంటలోనే రివ్యూలు రాయడం వలన కలెక్షన్స్‌కు ఎఫెక్ట్ పడుతుందని కాబట్టి సినిమా విడుదలైన మూడు, నాలుగు రోజుల తరువాత సమీక్షలు ఇవ్వాలని ఇటీవల రజినీకాంత్, విశాల్ వంటి నటులు కోరారు. రివ్యూలు, రేటింగుల కారణంగా సినిమా ప్రభావితం అవుతుందని వారి వాదన.
Samayam Telugu producer suresh babu comments about movie reviews
మూవీ రివ్యూలు ఉండాల్సిందే- బడా నిర్మాత


అయితే దీనికి కొందరు మద్దతుగా నిలిస్తే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇదే విషయమై మాట్లాడుతూ.. మీడియా స్వేచ్ఛకు అడ్డు చెప్పడానికి ఎలాంటి హక్కు లేదని అన్నారు. ఓ చెత్త సినిమాకు మంచి రివ్యూ ఇచ్చినా ఆడదని, అలానే ఓ మంచి సినిమాకు నెగెటివ్ రివ్యూ వచ్చినా దాని రిజల్ట్ మారదని చెప్పారు.

ఒక్కోసారి చిన్న సినిమాలకు ముందుగానే పాజిటివ్ రివ్యూలు రావడం వలన మంచి జరిగిందని అన్నారు. రివ్యూలు ఆపాలనుకోవడం కరెక్ట్ కాదని, ఒకవేళ మీడియా రివ్యూలు ఆపినా.. సోషల్ మీడియాలో వచ్చే అభిప్రాయాలను ఎవరు ఆపలేరు కదా అని పేర్కొన్నారు. సినిమా దాని స్థాయి బట్టి ఆడుతుందని దాని రిజల్ట్‌ను ప్రభావితం చేసే శక్తి దేనికీ లేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.