యాప్నగరం

'ఓం నమో వేంకటేశాయ' టైటిల్‌పై నిరసనలు

ఇంకో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ అవనుంది అనగా తాజాగా 'ఓం నమో వేంకటేశాయ' టైటిల్‌పై...

Samayam Telugu 7 Feb 2017, 9:52 am
ఇంకో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ అవనుంది అనగా తాజాగా 'ఓం నమో వేంకటేశాయ' టైటిల్‌పై కొంతమంది నిరసన వ్యక్తంచేస్తున్నారు. కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున నటించిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ఈ ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. వేంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరాం బాబా పాత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Samayam Telugu protests against om namo venkatesayas title ahead of its release
'ఓం నమో వేంకటేశాయ' టైటిల్‌పై నిరసనలు


అయితే, హాథీరామ్ బాబా మా గిరిజనుడే అని చెబుతున్న కొన్ని గిరిజన సంఘాలు ఈ టైటిల్‌పై నిరసన వ్యక్తంచేస్తున్నాయి. సినిమాను హాథీరామ్ బాబా యధార్థగాథ ఆధారంగా తెరకెక్కించినప్పుడు ఆయన పేరు పెట్టకుండా 'ఓం నమో వేంకటేశాయ' అని టైటిల్ పెట్టడంలో ఆంతర్యం ఏంటంటూ సదరు సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.

ఈ సినిమా దర్శకుడు, నిర్మాతలకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేసిన గిరిజన సంఘాలు టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాయి. అయితే, షూటింగ్ జరిగినంత కాలం ఏ అభ్యంతరం తెలపనివాళ్లు, ఇప్పుడిలా సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో టైటిల్‌పై వివాదం చేయడంలో వారి ఆంతర్యం ఏంటని సినిమా యూనిట్ ప్రశ్నిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.