యాప్నగరం

కన్నీళ్లు ఆగట్లేదు.. ధోనిపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

ధోని కొట్టిన ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరిచిపోగలను అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 2011 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో ధోని సిక్స్ కొడుతున్న ఫోటోను కూడా మహేష్ షేర్ చేశారు.

Samayam Telugu 16 Aug 2020, 9:07 am
భారత క్రికెట్ దిగ్గజనం మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నట్టు ప్రకటించగానే ఒక్కసారి యావత్ భారతదేశం షాక్‌కు గురైంది. ఇక క్రీడా లోకం అయితే మూగపోయింది. అందరూ ఒక్కసారిగా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఇక ధోని అభిమానులు గురించి వేరేగా చెప్పాల్సిన పని లేదు. టీ 20 వరల్డ్ కప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని రిటైర్ అవుతారేమోనని అందరు భావిస్తున్న తరుణంలో మహీ తాను రిటైర్ అయ్యే సమయం అయిందని ప్రకటించాడు.
Samayam Telugu మహేష్ బాబు, ధోని
mahesh babu dhoni


ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మారు మ్రోగిపోయింది. ధోని ఫ్యాన్స్‌తో పాటు.. పలువురు సెలబ్రిటీలు సైతం ధోని రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురవుతున్నారు. నువ్వొక లెజెండ్‌. నీ ఆటను ఎలా మరచిపోగలం అంటూ పలువురు అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, సెలబ్రిటీలు ట్వీట్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ..‘2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యంకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.
దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు మహీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీం ఇండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. గత ఏడాది టీం ఇండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత ధోనీ ఎప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తాడన్నది హాట్ న్యూస్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.