యాప్నగరం

PSPK 25 షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన లేటెస్ట్ డీటేల్స్ వెల్లడయ్యాయి.

TNN 9 Oct 2017, 2:59 pm
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన లేటెస్ట్ డీటేల్స్ వెల్లడయ్యాయి. అజ్ఞాతవాసి అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో వున్న ఈ సినిమా షూటింగ్‌ని నవంబర్‌లో పూర్తి చేసి డిసెంబర్ ఆడియో రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అక్టోబర్ 3వ వారంలో యూరప్ వెళ్లి కొన్ని పాటల్ని తెరకెక్కించనున్నారు. 15 రోజులపాటు జరగనున్న ఈ యూరప్ షెడ్యూల్ తర్వాత ఇండియాలో పలు కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. నవంబర్ చివరికల్లా మొత్తం షూటింగ్ ముగించుకుని డిసెంబర్‌లో ఆడియో రిలీజ్ సహా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాలని దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నారు.
Samayam Telugu pspk25s shooting latest updates
PSPK 25 షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్స్


వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ జోడీ కడుతున్నారు. నటుడు ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు వున్న మరో స్పెషల్ హైలైట్ ఏంటంటే.. మొట్టమొదటిసారిగా తమిళ యువ మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచందర్ ఓ డైరెక్ట్ తెలుగు సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పవర్ స్టార్ లాంటి టాప్ హీరో సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అవుతుండటంపై అనిరుధ్ కూడా ఫుల్ ఖుషీగా వున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.