యాప్నగరం

PSV గరుడవేగ వసూళ్లు.. ఫైనల్‌గా ఎంతంటే!

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన పీఎస్‌వీ గరుడవేగ సినిమాకు సంబంధించిన వసూళ్ల గురించి

TNN 14 Dec 2017, 1:57 pm
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన పీఎస్‌వీ గరుడవేగ సినిమాకు సంబంధించిన వసూళ్ల గురించి భిన్నమైన మాటలే వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఇరవై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని దీని రూపకర్తలు పేర్కొన్నారు. అది కూడా తొలి ఇరవై రోజుల్లోనే ఈ సినిమా ఆ వసూళ్లను సాధించేసిందని ప్రకటించారు.
Samayam Telugu psv garuda vega final collections at box office
PSV గరుడవేగ వసూళ్లు.. ఫైనల్‌గా ఎంతంటే!


అయితే తాజాగా ఈ సినిమా ట్రేడ్ రిపోర్టు గురించి ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. పీఎస్‌వీ గరుడవేగ థియేటరికల్ రన్ దాదాపుగా ముగిసిన నేపథ్యంలో... ఈ సినిమా వసూళ్ల గురించి ట్రేడ్ ఎనలిస్టులు మొత్తం వసూళ్లు ఏడున్నర కోట్ల రూపాయలు అంటున్నారు. ఇది షేర్ మొత్తం. గ్రాస్ వసూళ్లు దీనికంటే ఎక్కువగానే ఉంటాయి. షేర్ మొత్తం ఏడున్నర కోట్లు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ నేపథ్యంలో ఈ వసూళ్లు దక్కాయని తెలుస్తోంది.

ఈ సినిమా బడ్జెట్ భారీ స్థాయిలోనే ఉంది. సుమారు పదిహేను కోట్ల రూపాయల పై స్థాయి బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందింది. అయితే.. ఈ సినిమాకు శాటిలైట్, డిజిటిల్ రైట్స్ ప్రధాన ఆదాయ వనరులుగా అగుపిస్తున్నాయి. సినిమా హిట్ అనిపించుకున్న నేపథ్యంలో శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ మొత్తమే దక్కిందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సన్నీలియోన్ ఉండటం, యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో దీన్ని.. ఇతర భాషల్లోకి అనువదించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

ఇలాంటి ఆదాయ మార్గాలతో పీఎస్‌వీ గరుడ వేగ నిర్మాతలు బయటపడే స్థితి ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.