యాప్నగరం

మాకు ఎవరూ లేరనుకున్నాం, కానీ... జీవిత!

యాక్షన్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ' పీఎస్వీ గరుడ వేగ' నవంబరు 3 న విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది.

TNN 7 Nov 2017, 6:10 pm
యాక్షన్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ' పీఎస్వీ గరుడ వేగ' నవంబరు 3 న విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ రోజు రోజుకి వసూళ్లు పుంజుకోవడంతో చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై జీవిత చాలా ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సినిమా సక్సెస్ కి కారకులైన వారికి థ్యాంక్స్ అనే ఒక మాట చెబితే సరిపోదని అన్నారు. దర్శకులందరికి టాలెంట్ ఉంటుంది కానీ, మానవత్వం అనేది కొందరికే ఉంటుంది... అది ప్రవీణ్‌లో ఉంది... ఇది ఎప్పుడూ ఇలాగే కొనసాగించాలని జీవిత సూచించారు.
Samayam Telugu psv garudvega jeevitha emotional words about industry
మాకు ఎవరూ లేరనుకున్నాం, కానీ... జీవిత!


ఒక్క ఫోన్ కాల్ చేసి .. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయమని అడగ్గానే రానా .. కాజల్ .. తాప్సి .. మంచు లక్ష్మీ అంగీకరించడం విశేషమని తెలిపారు. అసలు కాజల్, తాప్సిలతో నేనుగానీ, రాజశేఖర్ గానీ ఎప్పుడూ వర్క్ చేయలేదు... కానీ, అడగ్గానే వాళ్లు మంచి మనసుతో సరేననడం గొప్ప విషయమని అన్నారు. మీది లక్కీ హ్యాండ్, థ్రియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయమని ముందు రోజు రాత్రి నా కుమార్తె శివాని, నేను వెళ్లి బాలకృష్ణ గారిని కోరితే వెంటనే అంగీకరించారు. అంతేకాదు అయనే స్వయంగా ముహూర్తం పెట్టిమరీ ట్రైలర్ ను లాంచ్ చేశారని అన్నారు.

ఈ సినిమా విడుదల తరువాత చిరంజీవి, మహేశ్ బాబు, రాజమౌళి ఇలా సినీ పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు తమకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని జీవిత పేర్కొన్నారు. ‘మనకు ఎవరూ సహాయం చేయరా, మనకు ఎవరూ లేరా, మనకు మనమేనా అనుకున్న సమయం’లో వీళ్లంతా తమకి అండగా నిలిచారంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. చిత్ర పరిశ్రమ మొత్తం తమ వెనుక ఉన్నామని భరోసా ఇచ్చిందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.