యాప్నగరం

మళ్లీ ఆ రోజులు రావాలంటూ కన్నీరు పెట్టుకున్న పూరి జగన్నాథ్.. చొక్కాలు చిరగాలంటూ!!

గత కొన్ని నెలలుగా బోసిపోయిన థియేటర్స్‌ పూర్వ వైభవం సంతరించుకోవాలని కోరుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు పూరి జగన్నాథ్. ఈ మేరకు కన్నడ చిత్రపరిశ్రమ రూపొందించిన వీడియో షేర్ చేశారు.

Samayam Telugu 17 Nov 2020, 9:38 am
మహమ్మారి కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. దేశవ్యాప్తంగా కోరలు చాచి అన్ని రంగాలను కకావికలం చేయడమే గాక అన్ని రంగాల్లోని కార్మికుల వెన్నువిరిచింది. కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని నెలలపాటు లాక్‌డౌన్ విధించడంతో చేతిలో పని, జేబులో డబ్బు లేక విలవిల్లాడిపోయాయి కార్మిక వర్గాలు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. షూటింగ్ బంద్ కావడం, థియేటర్ల గేట్లకు తాళాలు పడటంతో సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాతరోజులు రావాలి, థియేటర్స్ ఈలలతో దద్దరిల్లిపోవాలని కోరుకుంటూ ఎమోషనల్ అయ్యారు పూరి జగన్నాథ్.
Samayam Telugu మళ్లీ ఆ రోజులు రావాలంటూ కన్నీరు పెట్టుకున్న పూరి జగన్నాథ్..
Puri Jagannadh


మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్‌ ప్రారంభమవుతున్నాయి. మూతపడిన థియేటర్స్‌ను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి అంగీకారం వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమా హాల్స్‌కి రావడానికి జంకి పోతున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులను తిరిగి సినిమా హాళ్లకు రమ్మని ఆహ్వానిస్తూ ‘ComeLets CelebrateCinemaAgain’ పేరుతో కన్నడ చిత్రపరిశ్రమ ఓ వీడియో రూపొందించింది.

Also Read: 47ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్.. షాకింగ్ కారణం

సినిమా థియేటర్స్ పూర్వ వైభవం సంతరించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సినీ పరిశ్రమలో ఉన్నవారికి థియేటర్లు దేవాలయాలతో సమానమని, ప్రేక్షకులే దేవుళ్ళని.. కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. కాగా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న పూరీ జగన్నాథ్.. ''ఈ వీడియో చూశాక నాకు కన్నీళ్లు వచ్చాయి. మళ్లీ ఆరోజులు రావాలి. విజిల్స్‌ వెయ్యాలి. పేపర్స్‌ ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా థియేటర్‌.. మన అమ్మ'' అని పేర్కొంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు.
a

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.