యాప్నగరం

మహేష్‌పై పూరీ అలకకు కారణం అదేనా?

మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్‌మేన్ వంటి సన్సేషనల్ హిట్స్ అందించిన దర్శకుడు పూరీ, ముచ్చటగా మూడో హిట్‌కి ప్లాన్‌చేసారు. ఆ సినిమానే ‘జనగనమన’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా తొలి లుక్ కూడా వచ్చింది. అయితే

TNN 20 Oct 2016, 6:22 pm
మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్‌మేన్ వంటి సన్సేషనల్ హిట్స్ అందించిన దర్శకుడు పూరీ, ముచ్చటగా మూడో హిట్‌కి ప్లాన్‌చేసారు. ఆ సినిమానే ‘జనగనమన’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా తొలి లుక్ కూడా వచ్చింది. అయితే ఆ చిత్రం ఎప్పుడు ప్రారంభవుతుంది. ఎప్పడు పూర్తవుతుందో, రిలీజ్ ఎప్పడో పూరీకి కూడా తెలియడం లేదట. కారణం మహేష్ బాబు షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఎప్పడు పట్టాలెక్కుతుందో అని పూరీ ఎదురుచూస్తున్నాడట. వాస్తవానికి మహేష్ ప్రస్తుతం మురుగదాస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌లో ఉండగానే తనకు ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందించిన ‘కొరటాల శివ’ దర్శకత్వంలో పనిచేయడానికి ఒప్పుకున్నాడట. అనంతరం వంశీ పైడిపల్లి‌తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో ‘జనగణమన’ సినిమా ప్రారంభం కావడానికి చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో పూరీ మహేష్‌పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పూరీ సినిమాని పూర్తి చేయడానికి పెద్దగా టైం తీసుకోడు, గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘బిజినెస్‌మాన్‌’ని కేవలం 70 రోజులలోనే పూర్తిచేశాడు. సినిమాను తొందరగా పూర్తి చేస్తాడని ముద్ర ఉన్న పూరీకి డేట్స్ ఇవ్వడానికి మహేష్ ఇంట్ర్‌స్ట్ చూపించకపోవడంతో పూరీ ఒకింత అలిగాడట. ఇటీవల ‘ఇజం’ ప్రమోషన్‌లో పాల్గొన్న పూరీ ‘జనగణమన’ సినిమా పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా ఉండొచ్చని అనటంతో ‘జనగణమన’ సినిమా ఇప్పట్లో లేనట్టే అని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు పూరీ జగన్నాథ్.
Samayam Telugu puri jagannadh vexed with mahesh babu
మహేష్‌పై పూరీ అలకకు కారణం అదేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.