యాప్నగరం

పూరీ ఏం చూస్తున్నాడబ్బా..?

మోకాళ్లపైకి చిన్న నిక్కరు వేసుకుని గోడకు ఆనుకుని ఓ అమ్మాయి ఫోన్‌లో ఏదో చేస్తుంది. అదే సమయంలో కిందన కూర్చున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఆ అమ్మాయి వైపు అదోలా చూస్తున్నాడు.

TNN 17 Feb 2017, 2:39 pm
మోకాళ్లపైకి చిన్న నిక్కరు వేసుకుని గోడకు ఆనుకుని ఓ అమ్మాయి ఫోన్‌లో ఏదో చేస్తుంది. అదే సమయంలో కిందన కూర్చున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఆ అమ్మాయి వైపు అదోలా చూస్తున్నాడు. ఇంతకీ ఆయన ఏం చూస్తున్నాడు. అమ్మాయి కాళ్లనా..? లేక అక్కడ ఇంకేమైనా ఉందా..? ఏమో ఎవరికి తెలుసు. ‘రోగ్’ సినిమా వర్కింగ్ స్టిల్స్ అని కొన్ని ఫొటోలు విడుదల చేసారు. అందులో పూరీ కింద కూర్చుని అదోలా చూస్తున్నారు అంతే.
Samayam Telugu puri jagannadhs rogue working stills
పూరీ ఏం చూస్తున్నాడబ్బా..?


ఇక విషయంలోకి వెళితే.. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘రోగ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మరో చంటిగాడి ప్రేమకథ’ అనేది టాగ్‌లైన్. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది. దీంతో తాజాగా సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర యూనిట్ బయటపెట్టింది. కొంత కాలంగా హిట్‌కు దూరమైన పూరీ ఈసారి ఎలాగైనా ఈ చంటిగాడితో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ బ్యానర్‌పై డాక్టర్ సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌. గోపి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా నిర్మాత సి.ఆర్. హనోహర్ కుమారుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.