యాప్నగరం

బాలకృష్ణ సినిమాతో పూరి కూతురు సినీరంగ ప్రవేశం

బసవతారకరామపుత్ర బాలకృష్ణ 101 సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ పనిలో పనిగా ఈ సినిమాతోనే

TNN 23 May 2017, 6:15 pm
బసవతారకరామపుత్ర బాలకృష్ణ 101 సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ పనిలో పనిగా ఈ సినిమాతోనే తన కూతురు పవిత్రను కూడా సినీ పరిశ్రమకి పరిచయం చేస్తున్నారట. అయితే, చాలా మంది అనుకుంటున్నట్టుగా పవిత్ర ప్రస్తుతానికి నటన సైడ్ కాకుండా డైరెక్షన్ సైడ్ తన తొలి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu puri jagans daughter pavitras debut in balakrishnas 101st movie
బాలకృష్ణ సినిమాతో పూరి కూతురు సినీరంగ ప్రవేశం


లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఆల్రెడీ పవిత్ర ఈ సినిమాకు పూరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి పని నేర్చుకుంటున్నట్టు సమాచారం. నటి చార్మి కూడా ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ మరిన్ని మెళకువలు నేర్చుకుంటోందట.

ప్రస్తుతం పోర్చుగల్ లో బాలకృష్ణ, శ్రియలపై పలు పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ తర్వాత కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తే ఇక షూటింగ్ కి ప్యాకప్ చెప్పొచ్చని జగన్ యూనిట్ భావిస్తోంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణని స్టైలిష్ అవతార్‌లో చూపిస్తున్నాడు జగన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.