యాప్నగరం

మెగాస్టార్ ఇంట్లో పీవీ సింధు.. ఆత్మీయుల మధ్య చిరు సత్కారం.. వీడియో వైరల్

ఒలంపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన భారత తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా తమ ఇంట్లోనే పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు.

Samayam Telugu 29 Aug 2021, 7:49 am
ఒలింపిక్స్.. ప్రతి అథ్లెట్‌కు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో మెడల్ సొంతం చేసుకోవడం అనేది ఓ గొప్ప అనుభూతి. ఈ ఏడాది భారత దేశ ప్రతిభను ప్రపంచదేశాల ముందుంచుతూ మన అథ్లెట్లు అదరగొట్టారు. ఒక బంగారు పతకంతో కలిపి ఏడు పతకాలు సొంతం చేసుకొని సత్తా చాటారు. ఇందులో బ్యాడ్మింటన్‌ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన భారత తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా తమ ఇంట్లోనే పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ఘనంగా సత్కరించారు.
Samayam Telugu మెగాస్టార్ ఇంట్లో పీవీ సింధు
Chiranjeevi


ఈ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్, శ్రీజ, ఇతర కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, టి. సుబ్బరామిరెడ్డి, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, శర్వానంద్, అజారుద్దీన్, చాముండేశ్వరీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు. తన బిడ్డను సత్కరించుకున్నట్లే ఉందని తెలుపుతూ చిరంజీవి ఆనందం వ్యక్తం చేయగా.. స్వచ్ఛమైన ప్రేమ చూపించే ఇలాంటి వారికోసం ఇంకా కష్టపడేందుకు ప్రయత్నిస్తానని సింధు పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ''దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన P.V.Sindhuని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది'' అని పేర్కొన్నారు. చూడటానికి కన్నుల పండగలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 'ఈ వీడియో చూసిన తరువాత మనసంతా ఉల్లాసంగా అనిపించింది, సింధుకి శుభాకాంక్షలు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.