యాప్నగరం

సంక్రాంతికి వస్తున్న `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య`

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి, సహజనటి జయసుధ భార్యభర్తలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’.

TNN 31 Dec 2016, 11:57 am
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి, సహజనటి జయసుధ భార్యభర్తలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి దర్శక నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.
Samayam Telugu r narayana murthy jayasudha latest movie head constable venkatramaiah to be release on sankranthi
సంక్రాంతికి వస్తున్న `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య`


ఓ బాధ్యతాయుతమైన హెడ్ కానిస్టేబుల్ నిజాయతీగా వ్యవహరించడం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్యలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఇది మంచి క‌థ‌ అని, అన్ని వ‌ర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేసారు. నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ భార్యభర్తలుగా నటిస్తున్నారనగానే ప్రేక్షకుల్లో ఓ ఆస‌క్తి నెలకొందని చెప్పారు. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తామని, పాట‌ల‌ను కూడా అదే వారంలో విడుద‌ల చేస్తామని తెలిపారు.

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ‌, సునీల్ శర్మ, జ‌య‌ప్రకాశ్ రెడ్డి, త‌నికెళ్ల భ‌ర‌ణి, చ‌ల‌ప‌తిరావు, వెన్నెల కిశోర్‌, వై.విజ‌య‌, స‌మీర్‌, విజ‌య భాస్కర్‌, విజ‌య్‌, పార్వతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాసరావు సంగీతం అందించారు. కె. సుధాకర్ రెడ్డి ఛాయాగ్రహణం వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.