యాప్నగరం

కో.. అంటే కోటిన్నర పలికిన ఎర్రన్న!

ఇప్పటివరకు తన సొంత నిర్మాణంలోనే సినిమాలు చేసిన ఆర్.నారాయణమూర్తి మొదటి సారి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా కోసం బయట నిర్మాణ సంస్థలో పని చేశాడు.

TNN 21 Jan 2017, 8:47 pm
ఇప్పటివరకు తన సొంత నిర్మాణంలోనే సినిమాలు చేసిన ఆర్.నారాయణమూర్తి మొదటి సారి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా కోసం బయట నిర్మాణ సంస్థలో పని చేశాడు. నిజానికి 'టెంపర్' సినిమా కోసం పూరీ జగన్నాథ్ స్వయంగా నారాయణమూర్తిని సినిమాలో నటించమని అడిగారు. రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేశారు.. కానీ మూర్తి గారు మాత్రం నో చెప్పేశారు.
Samayam Telugu r narayana murthy shocking remuneration for head constable venkatramaiah
కో.. అంటే కోటిన్నర పలికిన ఎర్రన్న!


ఇదిలాఉంటే.. చదలవాడ చెప్పిన కథ ఇంట్రస్ట్‌గా ఉండటంతో ఎర్రన్న రంగుబట్టలేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే పారితోషికం ఇంత ఇవ్వండి అని మాత్రం అడగలేదట. కానీ చదలవాడ మాత్రం మూర్తి గారి చేతుల్లో కోటిన్నర పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన కెరీర్‌లో ఈ రేంజ్ పారితోషికం చూడడం ఇదే మొదటిసారి. కనుక ఫ్యూచర్‌లో ఇటువంటి ఆఫర్స్ వస్తే తిరస్కరించే అవకాశాలు కనిపించడం లేదు. ​ అంతేకాదు ఈ సినిమాలో నారాయణమూర్తికి భార్యగా నటించిన జయసుధ కూడా భారీ పారితోషికమే అందుకుందట.

ఇంతా చేసిన సినిమా వసూళ్లు అన్ని ఏరియాలు కలిపి చూసుకుంటే కోటి రూపాయలు కూడా వసూలు కాలేదు. ఇప్పటికీ తన సినిమాకు థియేటర్స్ దొరకలేదని నారాయణమూర్తి మీడియా ముందు వాపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.