యాప్నగరం

​ఆ సినిమా ‘మగధీర’కు కాపీ .. విడుదల ఆపండి..!

‘మగధీర’ సినిమా తెలుగులో పెద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

TNN 25 May 2017, 8:03 am
సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతీ సనన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన హిందీ సినిమా ‘రాబ్తా’ విషయంలో టాలీవుడ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా తమ సినిమాకు కాపీ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అంటున్నారు. తమ అనుమతి లేకుండా తమ కథను కాపీ కొట్టారని.. కాబట్టి ఈ సినిమా విడుదలను ఆపాలని ఆయన అంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఆయన వ్యాజ్యం దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu raabta movie is copy of magadheera producer accuses
​ఆ సినిమా ‘మగధీర’కు కాపీ .. విడుదల ఆపండి..!



ఇటీవలే ‘రాబ్తా’ ట్రైలర్ విడుదల అయ్యింది. దాన్ని చూసిన వారు రామ్ చరణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మగధీర’ సినిమాతో పోలిక పెట్టారు. ఇంతలోనే ఆ సినిమా తమ సినిమాకు కాపీ అని మగధీర నిర్మాత అల్లు అరవింద్ కోర్టుకు ఎక్కారు. ఆయన వ్యాజ్యాన్ని విచారణకు తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను జూన్ ఒకటికి వాయిదా వేసింది.

జూన్ తొమ్మిదిని ‘రాబ్తా’ విడుదల తేదీగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ వ్యవహారంపై ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ‘మగధీర’ సినిమా తెలుగులో పెద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.