యాప్నగరం

రబ్‌తా ట్రైలర్: కృతిసనన్‌ కిస్‌లతో రచ్చ

బాలీవుడ్ సినిమాల్లో ముద్దుగుమ్మలు ముద్దులకు ఏమాత్రం మొహమాటపడరు. రొమాన్స్ సన్నివేశాలలో అయితే డైరెక్టర్ చెప్పాలే కాని అంతకు మించి అన్న రేంజ్‌లో నటించడమే కాదు జీవించి చూపిస్తారు.

TNN 18 Apr 2017, 7:40 pm
బాలీవుడ్ సినిమాల్లో ముద్దుగుమ్మలు ముద్దులకు ఏమాత్రం మొహమాటపడరు. రొమాన్స్ సన్నివేశాలలో అయితే డైరెక్టర్ చెప్పాలే కాని అంతకు మించి అన్న రేంజ్‌లో నటించడమే కాదు జీవించి చూపిస్తారు. తాజాగా తెలుగులో మహేష్‌తో ‘1 నేనొక్కడినే’ మూవీలో ఆడిపాడిన కృతిసనన్‌ బాలీవుడ్‌లో మరోసారి కిస్సులతో రచ్చచేస్తుంది.
Samayam Telugu raabta official trailer
రబ్‌తా ట్రైలర్: కృతిసనన్‌ కిస్‌లతో రచ్చ


ఈ హాట్ బ్యూటీ నటించిన తాజా చిత్రం ‘రబ్‌తా’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సుషాంత్‌‌సింగ్‌ రాజ్‌పుత్- కృతిసనన్‌ జంటగా దినేష్ విజెన్ దర్శకత్వంలో వస్తున్న మూవీనే ‘రబ్‌తా’. గత జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. విడుదలైన తొలిరోజే కోటిని క్రాస్ చేసి కోటిన్నర వైపు పరుగులు పెడుతుంది ఈ ట్రైలర్.


అంతగా ఈ ట్రైలర్‌లో ఏముందబ్బా అంటే.. ఈ ట్రైలర్ మొత్తం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ మూవీ ‘మగధీర’ ఛాయలే కనిపిస్తాయి. అయితే బాలీవుడ్ కాబట్టి ఆ రేంజ్‌లోనే ముద్దులు కౌగిలింతలతో నింపేశారు. మొత్తానికి మగధీరను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. తాజాగా ‘రబ్‌తా’ట్రైలర్‌ టాలీవుడ్ మూవీ మగధీరనే పోలి ఉండటంతో ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.