యాప్నగరం

'బాలకృష్ణుడు' ఆటకు రాశిఖన్నా పాట

ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నిస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా తన గొంతును వినిపించింది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో పాట పాడడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ.

TNN 14 Aug 2017, 9:12 pm
ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నిస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా తన గొంతును వినిపించింది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో పాట పాడడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. నారా రోహిత్ హీరోగా.. పవన్ మల్లెల దర్శకత్వంలో 'బాలకృష్ణుడు' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రెజీనా కనిపించనుంది.
Samayam Telugu raashi khanna sings a song for nara rohit movie
'బాలకృష్ణుడు' ఆటకు రాశిఖన్నా పాట


ఇటీవల నార్వేలో జరిపిన షూటింగ్ తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మొదటిసారిగా ఈ సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఉన్న ఓ పాటకు రాశిఖన్నా వాయిస్ అయితే బాగుంటుందని ఆలోచించిన దర్శకుడు పవన్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.

రాశి కూడా ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటను రికార్డ్ చేయబోతున్నారు. రాశి ఇలా పాటలు పాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో 'ఊహలు గుసగుస లాడే','జోరు' వంటి సినిమాలకు గొంతు కలిపింది. ఇప్పుడు మరోసారి తన గాత్రంతో ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.