సల్మాన్ ఖాన్, జాక్వెలీన్ ఫెర్నాండేజ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేస్ 3’. దర్శకులు అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ చిత్రంలో అనీల్ కపూర్, సకీబ్ సలీం, బాబీ డియోల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకాధరణ పొందుతోంది. ఈ సినిమాను 3డీలో విడుదల చేయనున్నారు.
అయితే, ఈ సినిమా హీరోయిన్ జాక్వెలిన్‌కు చేదు అనుభవంగా మిగిలిపోతుంది. షూటింగ్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె కంటికి గాయమైంది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించింది. గాయం వల్ల ఆమె కంటిలోపల ఉండే ఐరిస్ రూపం కోల్పోయింది. దీనికి చికిత్స కష్టమని, ఇక జీవితాంతం తాను అలా వంకర తిరిగి ఐరిస్‌తో ఉండాల్సిందేనని ఆమె తన ఇన్‌స్టాగ్రమ్ ద్వారా వెల్లడించింది.
ఈ సందర్బంగా ఆమె కంటి ఐరిస్‌కు సంబంధించిన చిత్రాన్ని కూడా పోస్ట్ చేసింది. ‘‘ఇది ఇక పర్మినెంట్ గాయం. నా ఐరిస్ ఎప్పటికీ గుండ్రంగా కనిపించదు. అయితే, నేను చూడగలుగుతున్నందుకు చాలా అదృష్టవంతురాలిని’’ అని తెలిపింది. ‘రేస్ 3’ చిత్రం జూన్ 15న విడుదల కానుంది.